ఏపీలో ఎల్లుండి నుంచి ఉద్యోగ సంఘాల ఉద్యమం ప్రారంభం కానుంది. సంఘాలలో ఐక్యత లేకపోయినా ఉద్యోగులు అంతా సమిష్టిగా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఉద్యోగసంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దశల వారీగా నిరసనలు,ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇక నుంచి 10నుంచి ఐదు గంటల వరకు మాత్రమే ఉద్యోగం అని అన్నారు.
సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారుల తీరుపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై మురికినీరు ప్రవహించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
Advertisement
ఈ నెల 10న సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతానని ఏంపి అవినాష్ రెడ్డి అన్నారు.
12న మా నాన్న భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరవుతారు.. వేంపల్లిలో జరిగిన వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, కన్వీనర్లు, వాలంటీర్లు సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
నేడు ఆడిటర్ బుచ్చిబాబు బెయిల్ పై స్పెషల్ కోర్టు ఆర్డర్ ఇవ్వనుంది. లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ జలసౌధలో నదుల అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు పాల్గొననున్నారు.
Advertisement
ఢిల్లీ లో మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ నేటితో ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం స్పెషల్ కోర్టులో సిసోడియాను అధికారులు హాజరు పరచనున్నారు. వారం రోజులపాటు లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించింది.
కరీంనగర్ 22వరోజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్ర ప్రారంభం కానుంది.ఉదయం 9 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోనున్నారు.
తిరుమల కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. నిన్న శ్రీవారిని 74,994 మంది భక్తులు దర్శించుకున్నారు.
బంజారాహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని వైట్ హౌస్ సిల్వర్ హోటల్లో పోలీసుల దాడులు నిర్వహించారు. హోటల్లో గుట్టుచప్పుడుగా వ్యభిచా* నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ముగ్గురు హోటల్ సిబ్బందితో పాటు ముగ్గురు విటు*… ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.