దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ క్రికెట్ కి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే ఈ దక్షిణాఫ్రికా జట్టు మాజీ కెప్టెన్, ప్రపంచ క్రికెట్లో మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరుగాంచిన ఏబీ డివిలియర్స్, ఆఫ్ఘనిస్తాన్ దిగ్గజ ఆటగాడు రషీద్ ఖాన్‌ను టీ20లో ఆల్ టైమ్ గొప్ప ఆటగాడిగా అభివర్ణించాడు. ఏబీ డివిలియర్స్ టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ లేదా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేర్లను ప్రకటించకుండా తన నిర్ణయంతో క్రికెట్ అభిమానులందరినీ ఆశ్చర్యపరిచాడు.
Also Read : “బలగం” వివాదంపై జబర్దస్త్ వేణు క్లారిటీ.. అసలు కథ ఎవరిదంటే ?
Advertisement
ఎందుకంటే ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఈ ఫార్మాట్లో గొప్ప ప్రదర్శనను చూడవలసి వచ్చింది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ గా డివిలియర్స్ బాధ్యతలు చేపట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డివిలియర్స్ కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురు అయింది. ప్రపంచ క్రికెట్ లో ఇప్పటివరకు తన అత్యుత్తమ టీ 20 క్రికెటర్ ఎవరని ఏబీడీని అడగ్గా.. అందుకు అతడు ఏమీ ఆలోచించకుండా రషీద్ ఖాన్ అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Advertisement
Also Read : దక్షిణాఫ్రికాకు శుభవార్త.. మూడేళ్ల తరువాత ఆ క్రికెటర్ రీ ఎంట్రీ..!
రషీద్ ఖాన్ బాల్ తో పాటు బ్యాట్ తో కూడా అద్భుతంగా రాణించగలడు. రెండు విభాగాలలో తన జట్టుకు 100 శాతం న్యాయం చేయగలడు. అతడు ఫీల్డింగ్ లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు. ప్రపంచ క్రికెట్ లో నెం1 గా ఉండాల్సిన అర్హతలు అన్ని అతనికే ఉన్నాయి అని డివిలియర్స్ పేర్కొన్నాడు. చివరి సీజన్లో రషీద్ ఖాన్‌ను రూ.15 కోట్లకు గుజరాత్ టైటాన్స్ తన జట్టులోకి చేర్చుకుంది. ఆ జట్టును విజేతగా నిలపడంలో రషీద్ బంతి, బ్యాటింగ్‌తో ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రషీద్ ఖాన్ 511 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా రషీద్ ఖాన్ 1893 పరుగులు చేశాడు.
Also Read : టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం