సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి ట్రోల్స్ ఎదుర్కొని ఏకైక నటుడిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నా మంచు మనోజ్, మౌనిక రెడ్డి ఎట్టకేలకు రూమర్లకు తెరదించుతూ మార్చి 3వ తేదీన రాత్రి ఫిలింనగర్ లో 8:30 సమయంలో మంచు లక్ష్మీ నివాసంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
read also : Amigos OTT Release: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement
అయితే ఈ పెళ్లి మంచు మోహన్ బాబు కు ఇష్టం లేదని, అందుకే మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి బ్రేకులు వేస్తూ మోహన్ బాబు దంపతులు మంచు మనోజ్, మౌనిక రెడ్డి పెళ్లిలో సందడి చేశారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. మౌనికకు ఓ కుమారుడు ఉన్నాడని తెలుసా? మౌనిక కంటే ముందు లక్ష్మీ ప్రణతిని ప్రేమ వివాహం చేసుకున్నారు మనోజ్. కొన్ని రోజులకు విడాకులు తీసుకున్నారు. వాళ్ళిద్దరికీ పిల్లలు లేరు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్ రెడ్డితో భూమా నాగ మౌనిక రెడ్డి మొదటి వివాహం జరిగింది.
Advertisement
ఆ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ధీరవ్ రెడ్డి. ఇప్పుడు ఆ బాబు బాధ్యతను కూడా మనోజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే, మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తాను, తన భార్య భూమా మౌనిక రెడ్డి చేతులు కలిపిన ఫోటోను షేర్ చేసి, ‘శివుని ఆజ్ఞ’ అని క్యాప్షన్ పెట్టారు. అందులో మౌనిక రెడ్డి కుమారుడు చేయి కూడా ఉంది. కాగా మౌనిక రెడ్డికి 2018 లో ధీరవ్ రెడ్డి జన్మించాడు. భర్తకు విడాకులు ఇచ్చారు. మంచు మనోజ్ కూడా మొదటి భార్యతో విడిపోయారు. కొడుకు ఉన్న మహిళలను మళ్లీ పెళ్లి చేసుకోవడంతో మనోజ్ ది గొప్ప మనసు అని నెటిజన్లు అభినందిస్తున్నారు.
READ ALSO : టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం
శివుని ఆజ్ఞ 🙏🏼❤️ #MWedsM #ManojWedsMounika pic.twitter.com/U5hQ5V9xqL
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 4, 2023