Home » Mar 3rd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 3rd 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఇండోర్‌ టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది.

Advertisement

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ప్రారంభం అయ్యింది. 26 దేశాల నుంచి 15 వేల మంది ప్రతినిధులు సమ్మిట్ కు హాజతయ్యారు. సమ్మిట్‌ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామికవేత్తలు ప్రసంగించనున్నారు.

చిత్తూరు జిల్లా పలమనేరు, గుడియాత్తం రోడ్డుపై ఏనుగుల గుంపు హల్ చల్ చేసింది. గంటల కొద్ది రోడ్డుపై ఏనుగుల గుంపు తిరుగుతూ ఉండటం తో ప్రయాణికులు భయాందోళన లో ఉన్నారు.

నేడు హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరగనుంది. యాత్రలో అదనపు సెక్యూరిటీ కల్పించాలని రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.

గవర్నర్ తమిళిసై పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను అమోదించకుండా పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంలో రిట్ పిటిషన్ వేసిన ప్రభుత్వం.. బిల్లులను ఆమోదించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ లో పేర్కొంది.

Advertisement

హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో నేడు మంచు మనోజ్ వివాహం జరగనుంది. భూమా మౌనికారెడ్డిని మనోజ్ వివాహమాడనున్నారు. రాత్రి 8.30 నిమిషాలకు ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరగనుంది.

ఐటీ అంటే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కాదని….. ఐ అంటే ఇండియా, టీ అంటే తైవాన్‌ అని కెటిఆర్ అన్నారు. సాఫ్ట్‌వేర్‌కు ఇండియా పవర్‌ హౌస్‌ అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

 

ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ సుల్తాన్పురి లోని మురికవాడల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

రేషన్ లబ్ది దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుండి బలవర్థకమైన ఫోర్డ్ ఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రకటించింది.

Visitors Are Also Reading