అదానీ వ్యవహారంపై ఆరుగురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిటీ వేసింది. రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశించింది. అదానీ షేర్ల పతనంపై కమిటీ విచారణ జరపనుంది.
విశాఖలో నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటించనున్నారు. సీఎం సమక్షంలో రెండు రోజులు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. సీఎం పర్యటన, GIS అతిథులు రాకతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
Advertisement
నేడు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తున్నారు. మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతుంది. నిన్న శ్రీవారిని 60,931 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఢిల్లీ ఎన్నికల కమిషన్ నియామకాలపై ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది.
నేడు హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో టీవర్క్స్ ప్రారంభం కానుంది. రూ.100 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Advertisement
మోస్ట్ వాంటెడ్ సైబర్ నేరగాడిని అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. 13కేసుల్లో నిందితుడిగా ఉన్న శ్రీకాకుళంకు చెందిన సిరిగిడి ప్రవీణ్ ను కేరళ లో రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆప్ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ ముగిసింది. సిసోడియా ఢిల్లీ అభివృద్ధికి పనిచేశారని….పంజాబ్ లో ఆప్ గెలిచాక,బీజేపీ తట్టుకోలేకపోతోంది..సిసోడియా, సత్యేంద్ర జైన్ లు బీజేపీలో చేరితే ఏ కేసులుండవు..ఇంటింటికి వెళ్తాం..బీజేపీ వ్యవహారం ప్రజలకు వివరిస్తాం అంటూ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
నరేంద్ర మోడీ బడ్జెట్ గిరిజనులకు వ్యతిరేకంగా ఉందని…. కేంద్రప్రభుత్వం గిరిజనుల విద్య, అటవీ హక్కుల చట్టాన్ని హరించేస్తోదని సీపీఎం నేత బృందా కారత్ వ్యాఖ్యానించారు. దేశంలో ఒక్కశాతం ఉన్న ధనవంతుల చేతుల్లోకి 40 శాతం సంపద చేరిందని ఆమె ఆరోపించారు.
జీవో 59పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవో 59 ను సవరిస్తూ మరో జీవో జారీ చేసింది. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసుకుని ఉంటున్న వారికి, ULC సర్ ప్లస్ లాండ్ క్రమబద్ధీకరణకు 2014లో జీవో ప్రభుత్వం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.