పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సరికొత్త అనుభూతిని మిగులుస్తుంది.. ముఖ్యంగా పెళ్లి చేసుకునే వధూవరులు ఇద్దరు ఒక కొత్త అనుభవాన్ని పొందగలుగుతారు. ఇందులో అమ్మాయి అయితే తను పుట్టి పెరిగిన ప్రాంతం అమ్మానాన్న అన్ని వదిలి అత్తవారింటికి కొత్త స్థలానికి వచ్చేస్తుంది. అంతా కొత్త మనుషులు, అన్నీ కొత్తగా ఉంటాయి. ఈ సమయంలో అమ్మాయి తప్పనిసరిగా ప్రతి విషయాన్ని తన భర్తతో మాత్రమే చెప్పగలుగుతుంది. కాబట్టి ప్రతి మగాడు పెళ్లికి ముందు అమ్మాయి పడే కష్టాలు తెలిస్తే వచ్చే కొత్త అమ్మాయిని చాలా ఆనందంగా చూసుకోగలుగుతారు. ముఖ్యంగా ప్రతి తల్లి పెళ్లికి ముందు తన కొడుక్కి ఈ విషయాలు తప్పనిసరిగా చెప్పాలని నిపుణులు అంటున్నారు. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం..
#1. భార్యను అమ్మతో పోల్చరాదు :
ముఖ్యంగా వచ్చే భార్యను ఎప్పుడు కూడా అమ్మతో పోల్చవద్దు. ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల సంసార అనుభవం ఉంది. కానీ నీకు వచ్చే భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం. నిన్ను నేను ఎలా పెంచానో, తనని కూడా వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు. తనకు అన్ని అలవాట అయ్యే వరకు బాగా చూసుకోవాలని అబ్బాయికి చెప్పాలి.
Advertisement
Advertisement
#2. స్నేహపూర్వకంగా ఉండాలి :
ముఖ్యంగా కొత్తగా ఇంటికి వచ్చిన మీ భార్యతో ఒక స్నేహితుడిగా ఉండాలి. ప్రతి విషయాన్ని తనతో పంచుకోవాలి. నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని కానీ, నీకు మాత్రం మమ్మల్ని, నీ భార్యను కూడా చూసుకోవాలి.
మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకొని ఆప్యాయంగా ప్రేమగా ఉండాలని చెప్పాలి.
#3. ప్రతి విషయం చర్చించాలి:
నీకు పెళ్లి కాక ముందులా కాకుండా నీకంటూ ఒక భార్య వచ్చిందని గ్రహించాలి. ప్రతి విషయాన్ని ఆమెతో చర్చించాలి. నువ్వెంతో ఆమె కూడా నీలో సగభాగం అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీ మంచి చెడులో జీవితాంతం తోడుగా తానే ఉంటుంది కాబట్టి, పుట్టింటి నుంచి వచ్చిన అమ్మాయికి అలవాట్లు పద్ధతులు కొత్తగా ఉంటాయి కాబట్టి అన్ని అలవాటు పడే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి.
#4. మాకంటే ఎక్కువగా ప్రేమించాలి:
తన పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇక జీవితం నీతోనే అంటూ వచ్చిన నీ భార్యను మా కంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి. చిన్న చిన్న సర్ప్రైజులు, కానుకలు ఇచ్చి తనను ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవాలని ప్రతి తల్లి తన కొడుకుకు పెళ్లికి ముందు చెప్పాలని నిపుణులు అంటున్నారు.
also read: