మహేశ్ బాబు కెరియర్ బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అతడు ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
Advertisement
ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వచ్చిందటే ప్రేక్షకులు అతుక్కుపోతుంటారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా సోనూ సూద్ కూడా కీలక పాత్రలో నటించాడు. అంతే కాకుండా ప్రకాష్ రాజ్ మరియు నాజర్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి మురళీమోసన్ నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాలో నాజర్ క్యారెక్టర్ కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
Advertisement
మహేశ్ బాబుకు తాతగా నాజర్ తన నటనతో ఆకట్టుకున్నారు. సమయానుగుంణంగా వచ్చే డైలాగులతో నాజర్ ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ పాత్రకోసం ముందుగా సీనియర్ హీరో శోభన్ బాబును అనుకున్నారట. అంతే కాకుండా నిర్మాత మురళీ మోహన్ బ్లాంక్ చెక్ ఇచ్చి మరీ శోభన్ బాబును సినిమాలో నటించాలని కోరారట. కానీ శోభన్ బాబు మాత్రం ఆ పాత్ర చేసేందుకు నిరాకరించారట. శోభన్ బాబు ఆ పాత్రకు నో చెప్పినందుకు పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే శోభన్ బాబు తాను యవ్వనంగా కనింపించినన్ని రోజులు మాత్రమే సినిమాలో కనిపించాలనుకున్నాడు.
also read : ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా…? షాక్ లో ఫ్యాన్స్..!
ఆ తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పేశాడు. ఎన్నో అవకాశాలు వచ్చినా శోభన్ బాబు మాత్రం నటించలేదు. తనను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ కూడా ఒక అందగాడిగానే గుర్తుంచుకోవాలని ఆ రూపమే తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోవాలని శోభన్ బాబు కోరిక అందువల్లే ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఇక అందువల్లే ఇప్పటికీ శోభన్ బాబు అందరికీ సోగ్గాడినే గుర్తుండి పోయాడు. అంతే కాకుండా శోభన్ బాబు వారసత్వంగా కూడా సినిమాల్లోకి ఎవరూ ఎంట్రీ ఇవ్వలేదు.