Home » ఆర్ఆర్ఆర్ విడుద‌ల వాయిదా…? షాక్ లో ఫ్యాన్స్..!

ఆర్ఆర్ఆర్ విడుద‌ల వాయిదా…? షాక్ లో ఫ్యాన్స్..!

by AJAY
Ad

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా తెర‌కెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో చిత్ర‌యూనిట్ ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉంది. దేశ‌వ్యాప్తంగా అన్నిభాష‌ల్లో సినిమాను విడుద‌ల చేస్తుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ కోసం చ‌ర‌ణ్ ఎన్టీఆర్ లు ముంబై, చెన్నై, బెంగుళూరుకు వెళ్లాల్సి వ‌స్తోంది. ఇక మ‌రో ప‌దిహేను రోజుల్లో సినిమా రాబోతుంద‌ని ఫ్యాన్స్ ఫుల్ కుషీలో ఉంటే తాజాగా ఓ వార్తతో షాక్ అవుతున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

ఒమిక్రాన్ వేరియంట్ ఎంట్రీతో దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనాపై ఆందోళ‌న మొద‌ల‌వుతోంది. ఇప్ప‌టికే న్యూయ‌ర్ పై ఆంక్ష‌లు కూడా విధించారు. రాష్ట్రాలు అప్ర‌మ‌త్తంగా ఉండాలని ప్ర‌ధాని మోడీ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు రావ‌డంతో క‌ర్ఫ్యూను కూడా విధించారు. ఇక కేసులు పెర‌గ‌టంతో మ‌ళ్లీ థియేట‌ర్లు మాల్స్ పై ఆంక్ష‌లు విధిస్తారా అన్న అనుమానాలు కూడా వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ కూడా సినిమా దైల‌మాలో ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

సినిమా విడుద‌లను వాయిదా వేసే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో వార్త‌లు చెక్క‌ర్లు కొడుతున్నాయి. ఇక త‌న అభిమాన హీరోల సినిమా విడుద‌ల‌కు రెడీ అవుతోందని ఎన్టీఆర్, చ‌ర‌ణ్ అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇలాంటి వార్త‌లు వ‌స్తుండ‌టంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే సినిమా విడుద‌ల ఉందా లేదా అన్న‌దానిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Visitors Are Also Reading