మెగాస్టార్ చిరంజీవి హీరోగా సౌందర్య, అంజలా జావేరి లు హీరోయిన్లుగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చూడాలని ఉంది’. 1998 వ సంవత్సరం ఆగస్టు 27న విడుదలైంది ఈ మూవీ. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తి కావస్తోందన్నమాట. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది అంజలా జావేరి.
Advertisement
ఈమె పేరుకు ఆ మూవీ సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వాస్తవానికి ఈ బ్యూటీ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన అంజలా జావేరి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. మరి ఆమె పిల్లాడిన వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా.
Advertisement
ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ, కన్నడ భాషల్లో స్టైలిష్ విలన్ గా తనదైన శైలి నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కాగా 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అంజలా జావేరి చివరిసారిగా కనిపించింది. అలాగే అంజలా జావేరి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమె భర్త తరుణ్ అరోరా తెలిపారు. ఆమెకు తగ్గ పాత్ర వస్తే వెంటనే ఓకే చెబుతుందని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు.
READ ALSO : తారకరత్న మృతి చెందిన 2 రోజులకే.. ఆయన భార్య సంచలన నిర్ణయం !