ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురుకొని మంచి ఉద్యోగం, ఇల్లు, బ్యాంకు బ్యాలెన్స్ లాంటివి సమకూర్చుకోవాలని అనుకుంటారు. అయితే వీటిలో కొన్నింటిని మాత్రమే అందులోనూ కొద్దిమంది మాత్రమే ఈ కలను నెరవేర్చుకోగలుగుతారు. అయితే చాలామంది భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బులు ఎక్కువగా వస్తున్నప్పటికీ ఆదా మాత్రం చేయలేరు. అంతేకాకుండా ఎల్లప్పుడూ రుణాల్లో ఉంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మూడు రాశుల వారు ఇతరుల నుంచి అప్పులు తీసుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ అప్పు తీసుకున్న దాన్ని తిరిగి చెల్లించలేరు. ఈ నేపథ్యంలో ఏ ఏ రాశుల వ్యక్తులు రుణాలు చేయకూడదు ఇప్పుడు చూద్దాం.
Advertisement
మేషం
సాధారణంగా మేషరాశి వారు డబ్బు బాగా సంపాదిస్తారు. లక్షల్లో సంపాదన ఉన్నప్పటికీ వాటిని ఆదా చేయడంలో మాత్రం విఫలం అవుతుంటారు. ఎంత ఆదాయం ఉంటుందో అంత ఖర్చులు ఉంటాయి. అందువల్ల పొదుపు కూడా ఉండదు. ఇది కాకుండా వారికి నిర్ణయం తీసుకునే శైలి ప్రత్యేకంగా ఉంటుంది. జీవితంలో డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు. అందుకే ఈ రాశి వారు రుణం తీసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వారికి తీర్చడం కష్టమవుతుంది.
Advertisement
తుల
మేషరాశి వారు కాకుండా డబ్బు కొరత ఉండే వాళ్ళలో తులారాశి వారు కూడా ఉంటారు. అనవసరంగా సొమ్మును ఖర్చు చేసే అలవాటు వీరికి ఉంటుంది. బంధువులు, స్నేహితులను పిలిచి ఇంట్లో పార్టీలకు ఫంక్షన్లకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు. బహుమతుల కోసం షాపింగ్ చేస్తూనే ఉంటారు. ఈ కారణంగా ఆర్థిక విషయాల్లో చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వీరు కూడా రుణాలు చేయకుండా ఉంటే మంచిది. అంతేకాకుండా సొమ్ము విషయంలో ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది.
కుంభం
కుంభరాశి వారికి ఆర్థిక విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడడానికి రోజు వారి ఉద్యోగాన్ని మారాల్సి వచ్చింది. ఈ కారణంగా వారు లాభాలు కంటే నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అందుకే డబ్బు విషయంలో తులారాశి వారు జాగ్రత్తలు వహించాలని నిపుణులు అంటున్నారు. తద్వారా వారి ఆదాయాలు మెరుగు పడడమే కాకుండా రుణాలు కూడా తీరుతాయి.
READ ALSO : SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు