Home » బ్రహ్మ ముహూర్తంలో దాగి ఉన్న రహస్యాలు ఇవే..!

బ్రహ్మ ముహూర్తంలో దాగి ఉన్న రహస్యాలు ఇవే..!

by Anji
Ad

సాధారణంగా మనం ఏదైనా పూజలు లేదా కార్యాలను బ్రహ్మ ముహూర్తంలో చేయాలనే మాట తరచూ వింటుంటాం. దీనిపై చాలామందికి కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి..? అసలు ఎందుకు ఆ పేరు పెట్టారు?  అనే విషయాన్ని  ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. 

Advertisement

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారట. ఒక ఘడియకు ప్రస్తుతం మన కాలం ప్రకారం.. 24 నిమిషాలు. ముహూర్తం అనగా రెండు ఘడియల కాలం అని అర్థం. 48 నిమిషాలను ముహూర్తం  అని అంటారు. ఒక పగలు, ఒక రాత్రిని కలిపి మొత్తాన్ని అహోరాత్రం అంటారు. అహోరాత్రానికి 30 ముహూర్తాలు ఉంటాయి. అనగా ఒక రోజులో 3 ముహూర్తాలుంటాయి. సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది దానిని  బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం.  ముహూర్తానికి ఆది దేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి.  వాస్తవానికి తెల్లవారుజామున కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు సూర్యోదయానికి రెండు ఘడియాల ముందు కాలాన్ని అనగా 48 నిమిషాల ముందు కాలాన్ని అసూరి ముహూర్తం అని.. అసూరి ముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు.

Advertisement

Also Read :   Chanakya Niti : భర్తలు తమ భార్యలకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు ఇవే..!

ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తమును లేచి భగవంతుడిని ధ్యానించి పనులు ప్రారంభించాలని మన పెద్దలు చెబుతుంటారు.  విద్యార్థులు కూడా బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా చదివితే వారికి ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా కూడా చాలా సులభంగా అర్థమవుతుంది. అలా చదివిన దానిని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారని గురువులు కూడా సూచిస్తుంటారు. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం సమయంలో నిద్ర లేవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.  బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల సూర్యుడి నుంచి వెలువడే లేత కిరణాలు మనపై ప్రచురించడం వల్ల అధిక మొత్తంలో విటమిన్ డి శరీరానికి అందుతుంది. సమయంలో వాతావరణంలోని ఆక్సిజన్ చాలా స్వచ్ఛమైనదిగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ముఖ్యమైన పనులు చేయడం ఉత్తమం. 

Also Read :  వేణుస్వామి అప్పుడు చెప్పింది నిజమేనా..? ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరై ఉండవచ్చు..!

Visitors Are Also Reading