టాలీవుడ్ నటుడు శ్రీహరి ప్రస్తుతం మన మధ్యన లేకపోయినా ఆయన చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్రవేసుకున్నారు. వందల చిత్రాలలో నటించి అభిమానులను సంపాదించుకున్నారు. శ్రీహరి ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ గా ఎదిగారు. హీరోగానే కాకుండా విలన్ గానూ ఆయన మెప్పించారు. మరోవైపు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు చేసి శభాష్ అనిపించుకున్నారు.
Advertisement
మగధీర సినినిమాలో షేర్ ఖాన్ పాత్రను శ్రీహరి తప్ప మరొకరు చేయలేరేమో అనే స్థాయిలో ఆ పాత్రలో జీవించారు. భద్రాచలం, పోలీస్, సాంబయ్య లాంటి సినిమాల్లో హీరోగా నటించి హీరోగా హిట్ లు అందుకున్నారు. ఇక సినిమాలలో బిజీగా ఉన్న సమయంలోనే శ్రీహరి నటి డిస్కో శాంతిని ప్రేమవివాహం చేసుకున్నారు. 1996లో వీరి వివాహం జరిగింది. ఇక శ్రీహరి అనారోగ్యంతో మరణించిన తరవాత రీసెంట్ గా డిస్కోశాంతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Advertisement
ఈ సంధర్బంగా డిస్కోశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీహరి చనిపోయిన తరవాత తమ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. శ్రీహరి బ్రతికున్నరోజులలో చాలా మంది సహాయం కోసం తమ ఇంటికి వచ్చేవారని చెప్పారు.
సంపాదనలో కొంతపేదవారికి ఖర్చు చేయడం శ్రీహరి సామాజిక బాధ్యతగా భావించేవారని అన్నారు. ఇక ప్రస్తుతం డిస్కో శాంతి కుటుంబంతో కలిసి చెన్నై లో ఉంటున్నారు. డిస్కో శాంతి కూడా ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండేవారు. కానీ అలాంటివారికి ఆర్థికిఇబ్బందులు రావడం నిజంగా బాధాకరం.
ALSO READ :ధనుష్ ‘సార్’ మూవీపై దర్శకుడు భారతీరాజా ఏమన్నారంటే..?