Home » నందమూరి కుటుంబానికి తాకిన శాపం ఏంటి..? ఎందుకు ఇలా జరుగుతుంది ?

నందమూరి కుటుంబానికి తాకిన శాపం ఏంటి..? ఎందుకు ఇలా జరుగుతుంది ?

by Anji
Published: Last Updated on
Ad

నందమూరి కుటుంబాన్ని అనుకోని ప్రమాదాలు, హఠన్మరణాలు తరుచూ వెంటాడుతూనే ఉన్నాయి. కొందరూ ప్రమాదాలలో మరిణిస్తే.. మరికొందరూ అనారోగ్య సమస్యలతో, గుండెపోటుతో ఇలా ఏదో ఒక రకంగా చనిపోతూనే ఉన్నారు. ఇది చూసిన మిగతా కుటుంబ సభ్యులే కాదు.. నందమూరి అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఒకరో ఇద్దరో అది కూడా అనుకోకుండా జరిగితే తట్టుకోగలరు. కానీ ఏళ్ల వ్యవధిలో ఇలా మరణిస్తుండడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నందమూరి ఫ్యామిలీలో అకస్మాత్తుగా జరిగిన విషాదాలు ఏంటి..? ఎప్పుడు జరిగాయనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

 

తొలుత ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు రోడ్డు ప్రమాదంలో మరణించారు. సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న సమయంలోనే త్రివిక్రమరావు చనిపోవడంతో నందమూరి కుటుంబ సభ్యులు చాలా బాధపడ్డారు. అదేవిధంగా త్రివిక్రమరావు చిన్న కుమారుడు హరిన్ చక్రవర్తి కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. ‘మనుషుల్లో దేవుడు’ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు హరిన్.. 1986లో వచ్చిన ‘మామ కోడళ్ల సవాల్’తో హీరోగా మారాడు. నటుడిగా ఎదిగే సమయంలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇక హరిన్ సోదరుడు కల్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వీ కూడా రోడ్ ప్రమాదంలోనే చనిపోయారు. ఇలా తనవాళ్లు చనిపోవడంతో.. కల్యాణ్ చక్రవర్తి.. చెన్నైలో స్థిరపడ్డారు. 

Advertisement

Also Read :  అల్లు అర్జున్ కోసం రాజమౌళితో గొడవపడ్డ అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా ?

 

అలాగే ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య కూడా రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు. ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, ఎన్టీఆర్ మనమడు, హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. 2014 డిసెంబర్ 06న జానకీరామ్, 2018 ఆగస్టు 29న హరికృష్ణ, 2022 ఆగస్టు 01న ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మరణించారు. మరోవైపు 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా కారు యాక్సిడెంట్ లో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్ లో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కారుకు ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తానికి నందమూరి ఫ్యామిలీ అనగానే అనుకోని ప్రమాదాలు, హఠాన్మరణాలు కళ్ల ముందు మొదులుతాయి. ఇదంతా చూస్తుంటే.. నందమూరి కుటుంబానికి ఏదేనా శాపముందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. మరోవైపు శాంతి పూజలు, పాప పరిహారం వంటివి చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 Also Read :  తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తీసుకున్న బాలకృష్ణ

Visitors Are Also Reading