Home » ఒక్క శత్రువు కూడా లేకుండా జీవించావయ్యా.. తారకరత్నకి హేట్సాప్..! 

ఒక్క శత్రువు కూడా లేకుండా జీవించావయ్యా.. తారకరత్నకి హేట్సాప్..! 

by Anji
Ad

నందమూరి తారకరత్న సినిమా హీరోగా, విలన్ గా నటించిన విషయం తెలిసిందే. తారకరత్న అందరివాడు.  సాధారణంగా ఒక వ్యక్తిని ప్రేమించే వాళ్లు ఉంటే.. పడని వాళ్లు కూడా కచ్చితంగా ఉండే ఉంటారు. మీరు ఏ వ్యక్తిని తీసుకున్నా సరే దాదాపు ప్రతీ ఒక్కరిలో ప్లస్ లు, మైనస్ లు ఉండడం కామన్. తారకరత్న విషయంలో జరగలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోకేష్ చేపట్టిన యువగం పాదయాత్ర సందర్భంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సమయంలో లేదా ఆసుపత్రికి తరలించే సమయంలో చాలా మంది తారకరత్నకు సహాయం చేశారు. 

Advertisement

అయినప్పటికీ వారి దీవెనలు మాత్రం ఫలించలేదు. శివరాత్రి పండుగ వేళ శివైక్య అయిపోయారు తారకరత్న. బతికిఉన్నన్ని రోజులు అజాతశత్రువుగానే ఉంటూ వచ్చాడు. హీరోగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ తారకరత్న నటుడిగా మాత్రం మెప్పించాడు. తన మూవీ కెరీర్ వల్ల ఇబ్బంది పడినప్పటికీ ఏం బాధపడలేదు. చాలా మంది హీరోలు, చేయడానికి ఆలోచించే విలన్ రోల్ ని అది కూడా అప్పట్లోనే అమరావతి సినిమాలో చేశాడు. ఆ సినిమాలో నటించినందుకు నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తరువాత అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ కూడా చేస్తూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్ లో ఒక్కర్నీ కూడా పల్లెత్తు మాట అనలేదు. ఒక్కరితో కూడా మాట పడలేదు. అందుకే తారకరత్న యువర్ రియల్లీ గ్రేట్. 

Advertisement

తారకరత్న చనిపోయాడనే వార్త తెలిసి తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బాధపడ్డారు. తమకు తెలిసిన ఒకటో నెంబర్ కుర్రాడు ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు రాజకీయ నాయకుల వరకు చాలా మంది సందర్శించి నివాళి అర్పించారు. తారకరత్నతో తమకు ఉన్నట్టువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నందమూరి ప్యామిలీ పై రాజకీయంగా విమర్శలు చేసేవాళ్లు కూడా మిగతా వాళ్లని ఏమైనా అనే వారు ఏమో గానీ తారకరత్న గురించి మాత్రం కామెంట్ చేసేవారు కాదు. తారకరత్న లైఫ్ ఎంత స్పెషలో చెప్పడానికి ఇదే కారణం. మంచిగా ఉన్నాడని విధికి కన్నుకుట్టిందో ఏమో కానీ తారకరత్నని తీసుకెళ్లిపోయింది. నందమూరి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి తారకరత్నలాంటి ఓ మంచి మనిషిని దూరం చేసింది. ఒక్క శత్రువు లేకుండా ఎలా బతికావయ్యా ? నీకు నిజంగా హేట్సాప్ అని నివాళి అర్పించారు. 

Also Read :  తారకరత్న భార్య అలేఖ్యకి అస్వస్థత..!

Visitors Are Also Reading