నందమూరి తారక రామారావు మనవడు నందమూరి తారకరత్న మృతి చెందారు. గత 23 రోజులుగా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నందమూరి తారకరత్న నిన్న మృతి చెందారు. ఈ విషయాన్ని నిన్న నారాయణ హృదయాలయ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. జనవరి 27వ తేదీన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Advertisement
అయితే ఈ పాదయాత్రలో నందమూరి తారకరత్న కూడా పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి చాలా ఉత్సాహంగా నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో ముందుకు సాగారు తారకరత్న. అయితే పాదయాత్ర ప్రారంభమై ఒక గంట వ్యవధి సమయం కాగానే తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు వెంటనే కుప్పంలోని ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచన మేరకు తారకరత్నను బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో గత 23 రోజులుగా తారకరత్న ప్రాణాలతో పోరాడాడు.
Advertisement
కానీ శివరాత్రి పర్వదినాన తారకరత్న, నిండు ప్రాణాలను కోల్పోయాడు. అయితే, తారకరత్న మృతిపై శ్రీ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. నారా వారి క్షుద్ర పూజలకు..తారక్ బలి అంటూ శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. బిడ్డ వచ్చిన వేళా, గోడ్డు వచ్చిన వేళా అంటారు మన తెలుగోళ్లు.. మొదటి రోజు యాత్రకు వాళ్ళు చేయించిన క్షుద్ర పూజలకు నిన్ను బలి ఇచ్చారన్నారు. మిత్రమా అంతే, నందమూరిని తెగటార్చటానికి వచ్చిన నా..రా.. హహహ.. హహహ… ఇది నీతో ఆగేది కాదులే నువ్వు మూడవ వాడివి అంతే, ఇంకా లెక్క ఆగలే, “రక్త దాహం రాజకీయం” మీకు శాపాలై పీడిస్తున్నాయని తెలిపారు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా వింటేగా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మీ ఆత్మకు శాంతి అంటూ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి.
READ ALSO : “ఎన్టీఆర్” నుండి “చిరంజీవి” వరకు…మహా శివుడి పాత్రలలో మెప్పించిన టాలీవుడ్ హీరోలు!