శివుడు ఎలా జన్మించాడు అని చెప్పడానికి పురాణాలను మనం చదవాల్సిందే. అయితే పురాణాలలో పలు చోట్ల పలు రకాలుగా శివుడి జన్మ గురించి రాసారు. శివ పురాణం, విష్ణుపురాణం ఇలా ఏదైనా కావచ్చు. ఏ పురాణం తీసుకున్న శివుడి యొక్క జన్మ గురించి రాశారు. కానీ ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా రాయడం విశేషం. ఏది ఏమైనప్పటికీ శివుడి జన్మ ఎలా జరిగిందనే అంశంపై నమ్మదగిన కొన్ని పురాణాలను ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం.
Advertisement
తొలుత శివపురాణాన్ని తీసుకుందాం. ఈ పురాణం ప్రకారం.. శివుడి జన్మ స్వయంగా జరిగిందంటారు. అనగా శివుడికి తల్లిదండ్రులు లేరు. అందుకు ఆయనను స్వయంబు అంటారు. పంచభూతాలను శివుడు అందుకే కంట్రోల్ చేయగలడు. దీంతో శివుడికి మృత్యువు అనే భయం కూడా లేదు. విష్ణు పురాణం ప్రకారం.. విష్ణువు నుదుటి గురించి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి జన్మ జరిగింది. విష్ణువు నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. శివ పురాణంలో విష్ణువు జన్మ గురిచి రాసి ఉంది. శివుడు ధ్యానం చేస్తూ.. రుద్రాక్ష మాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఓ రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ గమనించినట్టయితే.. విష్ణు పురాణం, శివ పురాణం రెండు ఒకదానికి మరొకటి విరుద్ధంగా ఉంటాయి. ఈ రెండింటిని పక్కకు పెట్టినట్టయితే మరో కథ కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది.
Advertisement
Also Read : రాత్రి సమయాల్లో అస్సలు నిద్ర పట్టడం లేదా…? అయితే, ఈ టిప్స్ పాటిస్తే.. హాయిగా పడుకోవచ్చు
అది ఏంటంటే.. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు ఇద్దరి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ కొనసాగింది. అప్పుడే వారి మధ్య మెరుస్తూ.. ఒక స్థంభంలా శివుడు ప్రత్యక్షమై ఎవరు అయితే ఈ స్థంభం చివరకు చేరుకుంటారో వారే గొప్ప అనే వాయిస్ వినిపిస్తుంది. దీంతో బ్రహ్మ ఒక పక్షి మాదిరిగా మారి ఆ స్థంభం చివరికీ చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది కుదరదు. విష్ణువు వరహా అవతారమెత్తి స్థంభం చివరికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది కుదరదు. దీంతో బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ ఓటమిని అంగీకరిస్తారు. దీంతో శివుడు.. స్థంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు. దీంతో విశ్వంలో శివుడే గొప్ప అని విష్ణువు, బ్రహ్మ ఒప్పుకుంటారు.దీంతో అప్పటి నుంచి శివుడు అమరుడయ్యాడు. స్వయంభుడయ్యాడు.
Also Read : అన్నం గంజి ఆరోగ్యం రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!