ప్రపంచ క్రికెట్ లో ఎన్నో లీగులున్నాయి. ఎన్ని లీగులున్నప్పటికీ ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ అలా ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. క్రికెట్ అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి. ఇప్పటికే దాదాపు 15 సీజన్ల వరకు జరిగింది ఐపీఎల్. 16వ సీజన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. తాజాగా ఇండియల్ ప్రీమియల్ లీగ్ 16వ సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఐపీఎల్ 16వ సీజన్ కి సంబంధించిన షెడ్యూల్, మ్యాచ్ ల వివరాలను బీసీసీఐ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.
Also Read : ICC Mistake : ఐసీసీ తప్పిదంతో టీమిండియాకు ఘోర అవమానం..!
Advertisement
Advertisement
మార్చి 31న ఐపీఎల్ 2023 ఎడిషన్ కి తెరలేవనుంది. ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభ వేడుకలను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ సీజన్ ఐపీఎల్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, సీఎస్ కే టీమ్ లు తలపడనున్నాయి. మార్చి 31 నుంచి మే 21 వరకు లీగ్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 28న నిర్వహించనున్నారు. మొత్తం 70 మ్యాచ్ లు జరుగనుండగా.. ఇందులో 18 డబుల్ హెడర్స్ ఉన్నాయి. ఐపీఎల్ లో పాల్గొననున్న జట్లలో ఒక్కో జట్టు 14 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. హోంగ్రౌండ్ లో ఏడు మ్యాచ్ లు, బయట ఏడు మ్యాచ్ లు ఆడనున్నాయి.
Also Read : పృథ్వి షాపై దాడి వీడియో బయటకి! తప్పు ఎవరిది?
ఐపీఎల్ 2023లో మొత్తం రెండు గ్రూపులు ఉండనున్నాయి. గ్రూపు-ఏలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గ్రూపు-బీలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ లన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ లో ప్రసారం కానున్నాయి.
Check out the full IPL schedule in Telegram: https://t.co/cz0abo3xq7 pic.twitter.com/MBpCQDdYtQ
— Johns. (@CricCrazyJohns) February 17, 2023