తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి అంటే ఒక స్టార్ డం సంపాదించుకున్న దర్శకుడు. ఆయన డైరెక్షన్లో ఎంతో మంది హీరోలుగా స్టార్స్ గా మంచి గుర్తింపు సాధించారు. అలాంటి పూరీ ఈ మధ్యకాలంలో వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. తాజాగా వచ్చిన లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి బాగా సైలెంట్ అయిపోయారు. పూరి జగన్నాథ్ సైలెంట్ గా ఉన్నారు అంటే వర్క్ లో లేడని కాదు ఓ బాలీవుడ్ మూవీ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అది బెడిసి కొట్టడంతో తిరిగి టాలీవుడ్ హీరోలతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. దీనికోసం గాను పూరి ఇద్దరు హీరోలను ఒకేసారి టచ్ లోకి తీసుకున్నాడు.
Advertisement
ఒక మంచి కథ తీసుకురా సినిమా చేస్తా అని ఇదివరకే పూరికి చిరంజీవి మాటిచ్చారట. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలన్నది పూరి జగన్నాథ్ కల.. చిరంజీవి డైరెక్ట్ గా చెప్పడంతో కథను రాసే పనిలో పడ్డారు పూరి జగన్నాథ్. చిరంజీవికి క్లాస్ మాస్ కమర్షియల్ ఏ సినిమా అయినా వర్కౌట్ అవుతుందని వాల్తేరు వీరయ్య మూవీ మరోసారి ప్రూఫ్ చేసింది. అందుకే చిరు కోసం ఓ మాస్ కథను రెడీ చేశారట పూరి. కానీ ఈ సినిమా చేయాలంటే చిరంజీవి ఒక కండిషన్ పెట్టారట. నెల రోజుల్లో పూర్తి స్క్రిప్ట్ తో రావాలని సూచించారట.
Advertisement
అంతేకాకుండా 30 రోజుల కాల్ షీట్లోనే సినిమా పూర్తి చేయాలనేది మరో కండిషన్. అంటే చిరు ఈ సినిమా కోసం కేవలం 30 రోజులే కేటాయిస్తాడన్నమాట. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే పూరితో మూవీ పట్టాలెక్కాలన్నది చిరంజీవి ప్లాన్. అంతేకాకుండా మరో హీరో బాలయ్యతో కూడా పూరి టచ్ లో ఉన్నాడట. కానీ బాలయ్య ఫ్రీ అవ్వాలంటే టైం పడుతుంది. ఆయన చేతిలో అనిల్ రావిపూడి సినిమా ఉంది. వీరిద్దరిని చూసుకుంటే పూరితో చిరుతోనే సినిమా చేసే అవకాశం వస్తున్నట్లు సమాచారం.
also read:స్కూటీ ధర రూ.1లక్ష.. ఫ్యాన్సీ నెంబర్ కి మాత్రం రూ.కోటికి పైగా..