వసంతకాలం అంటే చాలా రకాల పండ్ల సీజన్ అనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే అన్ని పండ్లు మరి ఏ కాలంలో కూడా రావు. తాజాగా ఈ పండ్లను కూరగాయలను విరివిగా తింటే చాలా మేలు అని నిపుణులు సూచిస్తుంటారు. ప్రధానంగా పోషకాహార నిపుణులు శరీర బరువు నిర్వహణకు అదేవిధంగా బరువు తగ్గాలనుకునేవారు సీజన్ గా లభించే పండ్లను తినమని సూచిస్తుంటారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి మెరుగవ్వడానికి సీజనల్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. ఈ సీజన్ లో దొరికే ఈ 5 రకాల పండ్లను తింటే శరీరానికి చాలా మేలు చేసినట్టు అవుతుందని నిపుణులు చెబతున్నారు. వారు సూచించే ఐదుపండ్ల గురించి ఓ సారి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
చెర్రీ :
వసంత రుతువు చివరిలో పుష్కలంగా లభించే చెర్రీ పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇది దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో బాగా పని చేస్తాయి.
స్ట్రాబెర్రీ
స్ట్రాబెర్రీలో విటమిన్లు సి, కె, ఫైబర్, ఫొలిక్ యాసిడ్, పొటాషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడంతో పాటు శరీరంలోని మంటను తగ్గించడానికి సాయం చేసే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Advertisement
ఫైనాపిల్స్
ఫైనాపిల్స్ ఎండాకాలంలో దొరికే చాలా మంచి పండు. విటమిన్ సి, మాంగనీస్, బ్రొమెలైన్ వంటివి ఉంటాయి. ఫైనాపిల్స్ తినడం వల్ల జీర్ణక్రియలో మంటను తగ్గించే ఎంజైమ్ లను విడుదల చేయడంలో సాయం చేస్తాయి.
ఆప్రికాట్లు
ఆప్రికాట్లు వసంత రుతువు చివరిలో లభిస్తాయి. ఇందులో కంటి ఆరోగ్యానికి సాయం చేసే విటమిన్ ఏ, రక్తపోటు నియంత్రించడానికి పొటాషియం నిల్వలు అధికంగా ఉంటాయి.
Also Read : ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ తాగితే ఏమవుతుందో తెలుసా ?
కివి ప్రూట్
వసంత రుతువులో లభించే ఫలాలలో కివీ ఫ్రూట్ ఒకటి. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆక్టినిడిన్ అనే ప్రత్యేకమైన ఎంజైమ్ కూడా పుష్కలంగా లభిస్తుంది. జీర్ణక్రియలో సహాయం చేయడంతో పాటు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్ల కారణంగా దీర్ఘకాలికమైన వ్యాధులు నయమవుతాయి.
Also Read : శాకుంతలం నుంచి వచ్చిన లిరికల్ సాంగ్ విన్నారా..?