Home » సమంత లానే అరుదైన వ్యాధితో బాధపడుతున్న అనుష్క‌….ఆ వ్యాధి ఏంటంటే…?

సమంత లానే అరుదైన వ్యాధితో బాధపడుతున్న అనుష్క‌….ఆ వ్యాధి ఏంటంటే…?

by AJAY
Published: Last Updated on
Ad

కొన్నేళ్లుగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానిస్తున్న బ్యూటీ అనుష్క శెట్టి. సూప‌ర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యోగా టీచ‌ర్ గా కెరీర్ ను ప్రారంభించి ఆ త‌ర‌వాత అనుకోకుండా సినిమాల్లో అడుగుపెట్టింది. పూరీ ద్వారా నాగార్జున కంట‌ప‌డ‌టంతో అనుష్క‌ను అవ‌కాశ‌మే వెతుక్కుంటూ వ‌చ్చింది. సూప‌ర్ సినిమా హిట్ అవ్వ‌డంతో పాటూ అనుష్క గ్లామ‌ర్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

Advertisement

దాంతో టాలీవుడ్ లో వ‌రుస ఆఫ‌ర్ ల‌ను అందుకుంది. ఆ త‌ర‌వాత ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్ర‌భాస్ లాంటి స్టార్ హీరోల‌కు జోడీగా న‌టించింది. ఇదిలా ఉంటే కొంత‌కాలంగా సెల‌బ్రెటీలు త‌మ‌కు ఉన్న వ్యాధుల గురించి బ‌య‌ట‌పెడుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ బ్యూటీ స‌మంత కొన్ని నెల‌ల క్రితం మ‌యోసైటిస్ తో బాధ‌ప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించింది.

Advertisement

Anushka Shetty

Anushka Shetty

మ‌యోసైటిస్ అనే కండ‌రాల నొప్పి కి సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి భారిన ప‌డిన‌ప్పుడు కండ‌రాలు ఉబ్బ‌డంతో పాటూ తీవ్ర‌మైన నొప్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక ప్ర‌స్తుతం ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటూ స‌మంత సినిమా షూటింగ్ ల‌లో పాల్గొంటోంది. అంతే కాకుండా ఒక‌ప్ప‌టి హీరోయిన్ ప‌వ‌న్ క‌ల్యాన్ మాజీ భార్య తాజాగా తాను గుండె సంబంధిత మ‌రియు ఇత‌ర వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా ఇప్పుడు అనుష్క సైతం త‌న‌కు ఉన్న వ్యాధిని బ‌య‌ట‌పెట్టింది. త‌న‌కు న‌వ్వే వ్యాధి ఉంద‌ని అనుష్క చెప్పింది. న‌వ్వ‌డం అంటే ఒక్క‌సారి మొద‌లు పెడితే ఆగకుండా 15 నుండి 20 నిమిషాలు న‌వ్వుతాన‌ని అది కూడా వ్యాధి అని చెప్పింది. త‌ను న‌వ్వే గ్యాప్ లో ప్రొడ‌క్ష‌న్ వాళ్లు టీ..స్నాక్స్ తీసుకువ‌స్తారంటూ కామెంట్ లు చేసింది.

also read :టాలీవుడ్ కమెడియన్స్ భార్యలను చూశారా.. ఎంత అందమంటే..?

Visitors Are Also Reading