తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ అంటే ఎలాంటి వివాదాలు లేని నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వెంకటేష్ నటించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ఒక మూవీ జయం మనదేరా. ఈ సినిమా 2000 సంవత్సరంలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు.అయితే ఈ మూవీ నిర్మాణానికి మరియు థమ్సప్ కంపెనీకి మంచి లింకు ఉంది.. మరి దాని వెనుక ఉన్న కథ ఏంటో చూద్దాం..
Advertisement
ఈ మూవీ కథ ప్రకారం చూసుకుంటే హీరో వెంకటేష్ లండన్ లో ఉంటాడు. హీరోయిన్ సౌందర్య మరియు ఇతర కమెడియన్స్ కలిసి థమ్సప్ చాలెంజ్ విన్నరై యూరప్ ట్రిప్ కి వెళ్తారు. అక్కడే హీరో హీరోయిన్స్ ఒకరితో ఒకరు కలిసి ప్రేమలో పాడడం వంటివి జరిగేది ఈ సినిమా కథ.. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటయ్యా అంటే.. ఈ చిత్రం కోసం థమ్సప్ కంపెనీ వారు దాదాపు 80 లక్షల వరకు ప్రమోషన్స్ కోసం ఇచ్చారట. వారు ఇచ్చిన ఆ డబ్బుతోనే సినిమా సగం పూర్తి చేశారు నిర్మాత సురేష్ బాబు.
Advertisement
ఇలా వారి డబ్బుతోనే సినిమా 70% తీయడం, ఆ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కలెక్షన్ల సునామి సృష్టించిందని తెలుస్తోంది. ఆ విధంగా సురేష్ బాబు తన బుర్రకి పదును పెట్టి ఆ కంపెనీ నుంచి డబ్బులు తీసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం అని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఆ సినిమాలో మంచి యాక్టింగ్, సెంటిమెంట్ సీన్స్ అదిరిపోవడంతో ఘన విజయాన్ని సాధించింది.
also read: