తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఇప్పటికే మోహన్ బాబు నట వారసులుగా మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక మంచు లక్ష్మి మాత్రం తన భాష యాసతో మంచి గుర్తింపు సాధించింది. మరీ ముఖ్యంగా ట్రోలర్స్ కి ఈమె ఏం మాట్లాడిన పండగే. టీవీ షోలు చేయకుండా కేవలం చిత్రాలతో బిజీగా ఉన్న మంచు లక్ష్మి తాజాగా మలయాళం సినిమా మాన్ స్టర్ లో లె**న్ లాగా నటించి అందరినీ ఆకట్టుకుంది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
Also read:పెద్దమ్మాయి అమెరికన్ ని చేసుకుంది… చిన్నమ్మాయికి పెళ్లి వద్దన్నాను-జగపతిబాబు
Advertisement
ఇక మంచు ఫ్యామిలీలో మనోజ్,విష్ణులతో పోలిస్తే మంచు లక్ష్మీ మాత్రమే సక్సెస్ లు అందుకుంటుంది. ఇక మంచు మనోజ్ అయితే సినిమాలు మానేసి వ్యాపారం చేసుకుంటున్నారు. త్వరలోనే రెండో పెళ్లి కి కూడా సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా చిత్తూరుకు వచ్చిన మంచు లక్ష్మి శ్రీ కాళహస్తికి వెళ్లి దర్శనం చేసుకుందట. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అయితే మనోజ్ రెండో పెళ్లి విషయంపై ఒక రిపోర్టర్ ప్రశ్నించగా అది గుడిలో ఎందుకు అడుగుతున్నారంటూ మాట దాటేసిందట.
వారు ఎంత ప్రయత్నించినా ఆ ప్రశ్నను దాటవేస్తూ ముందుకు కదిలిందట మంచు లక్ష్మి. ఇక మంచు విష్ణు అప్ క మింగ్ సినిమాల గురించి నన్ను అడగకండి తాను కనిపిస్తే తనని అడగండి అంటూ సమాధానం ఇచ్చిందట. ఇక తన యొక్క రాబోయే సినిమాల గురించి చెబుతూ త్వరలో అగ్ని నక్షత్రం సినిమా విడుదల కాబోతోంది. శివరాత్రి సందర్భంగా డివోషనల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు చెప్పింది.
Also read;“సార్” సినిమా ఫస్ట్ రివ్యూ…ఎలా ఉందంటే..?