Home » సైలెంట్ గా రకుల్ ప్రీత్ పెళ్లి.. ప్రియుడే వరుడా..? 

సైలెంట్ గా రకుల్ ప్రీత్ పెళ్లి.. ప్రియుడే వరుడా..? 

by Anji
Ad

రకుల్ ప్రీత్ సింగ్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. తెలుగులో తాను సినిమాలను తగ్గించేసింది. కానీ హీందీలో మాత్రం ఓ రెండు సినిమాలు చేస్తోంది. తాజాగా హిందీల్ ఛత్రీవాలీ అనే బోల్డ్ సినిమా చేసింది. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్ర మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో రకుల్ కండోమ్ క్వాలిటీ చెక్ చేసే పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా నిర్మించారు. ఇదిలా ఉంటే.. రకుల్ పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

Advertisement

గతంలో కూడా రకుల్ పై పలు రూమర్స్ రాగా.. మరోసారి ఆమె పెళ్లిపై రూమర్స్ వినిపిస్తున్నాయి. రకుల్ అతిత్వరలో హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చనున్నారట. ఈ విషయంపై రకుల్ త్వరలోనే ఓ ప్రకటన కూడా విడుదల చేసే అవకాశముందని సమాచారం. ఇటీవలే మరో ప్రేమ జంట కియారా, సిద్దార్థ్ మల్హోత్ర పెళ్లి చేసుకున్న విషయం విధితమే. 

Advertisement

Also Read :  అలా పిలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా.. రమ్యకృష్ణ కామెంట్స్ వైరల్..!

మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి ఏం బాగాలేదని పేర్కొంటున్నారు. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక ఆమె సతమతమవుతున్నారని తెలుస్తోంది. రెమ్యూనరేషన్ గురించి కూడా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రకుల్ రెమ్యునరేషన్ విషయంలో కాస్త సడలింపు ఇచ్చారట. ఒకేసారి కాకుండా.. రోజు రోజుకు అనగా డైలీ పేమెంట్స్ విధానంలోకి తీసుకొచ్చారట. ఒకప్పుడు హీరోయిన్ గా నటించడానికి ఆమె ఒక్క సినిమాకి కోటిన్నరకు పైగా తీసుకునేదట. కానీ ప్రస్తుతం డైలీ పేమెంట్స్ విధానంలో భాగంగా రోజుకు మూడు లక్షల వరకు తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి రకుల్ పెళ్లి పీటలెక్కనున్నట్టు తెలుస్తోంది. క్లారిటీ రావాలంటే మాత్రం రకుల్  అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

Also Read :   బాల‌కృష్ణ కోసం ఎవ్వ‌రూ చేయ‌ని ప‌నిచేసిన చిరంజీవి…ఆ ప‌ని ఏంటంటే..?

Visitors Are Also Reading