ఓ వైపు పండుగ.. మరోవైపు పరేషాన్.. మహాశివరాత్రి ముగింట్లో మహా సంకటకం. శివుడిని తలవాలా..? శనిని కొలచాలా..? శివరాత్రి పండుగ రోజే శని త్రయోదశి చాలా అరుదుగా వచ్చే ఈ సందర్భం అదృష్టమా..? అరిష్టమా..? తొలి పూజ ఎవ్వరికీ చేయాలి..? శివారాధన చేయాలా..? శనేశ్వరుడిని అభిషేకించాలా..? ఈనెల 18న శనివారం రోజు మహాశివరాత్రి. ఆరోజే అత్యంత అరుదైన సంఘటన చోటు చేసుకోబోతుంది. మహాశివరాత్రి రోజే శని త్రయోదశి కూడా రాబోతుంది. ఇప్పుడు ఉత్కంఠను రేపుతుంది.
Advertisement
మహాశివరాత్రి రోజు శని త్రయోదశి రావడం వల్ల తొలి పూజ ఎవరికీ చేయాలి అనే సందేహం ఉంటుంది. ఈశ్వరుడికి తొలి పూజ చేస్తే శనీశ్వరుడికి ఆగ్రహం వస్తుందా..? శనీశ్వరుడికి ప్రథమ తాంబూలం ఇస్తే ముక్కంటి మూడో కన్ను తెరుస్తాడా..? ఎవరికీ ముందు పూజ చేస్తే ఏమి కొంప మునుగుతుందో అనే సంకటంలో పడ్డారు భక్తులు. శివరాత్రి రోజు శివుడితే తొలి పూజ చేయాలని కొందరూ అంటే.. శనీశ్వరుడికే అగ్ర తాంబూలం ఇవ్వాలంటున్నారు. ఇలా పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనలతో భక్తులు మరింత అయోమయానికి గురవుతున్నారు. శనీశ్వరుడి వాహనం కాకికి బెల్లం నివేదిస్తారు. దీని వల్ల శని దోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. శని త్రయోదశి రోజు చేస్తే మరింత ఫలితముంటుందని భక్తులు నమ్ముతుంటారు. శని గ్రహ ప్రభావంపై ఎన్నెన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శివుడికి కూడా శని ఎఫెక్ట్ తప్పలేదంటున్నారు. దీని వెనుక కూడా ఓ కథ ఉంది.
Advertisement
Also Read : డాక్టర్ సమరం ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా ?
శని కరుణిస్తే కష్టాలు ఉండవు. శని కన్నెర్ర చేస్తే మటాషే. ఈశ్వరుడికైనా సరే శని దోషం తప్పదు. యముడికి సోదరుడు. జేష్టాదేవికి భర్త. శివుడికి పరమభక్తుడు. శివుడు శని భక్తిని పరిశీలించాలనుకుంటాడు. శనీశ్వరా.. నేను అంటే నీకు చాలా ఇష్టం కదా.. నేను ఏ రూపంలో ఉన్నా నువ్వు నన్ను గుర్తుపట్టగలవా..? అని అడిగాడట. తప్పకుండా గుర్తు పడతాను అని శని చెప్పాడట. శని ని పరీక్షించేందుకు శివుడు సూర్యోదయం వేళ బిల్వవృక్షంలా మారాడట. సాయంత్రం వరకు మామూలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. బిల్వ నుంచి అసలు వచ్చిన శివునికి శని కనిపించాట. శనీశ్వరా నన్ను ప్టుకోలేకపోయావుగా అని అన్నాడట. అదేంటి నేను పట్టుకోవడం వల్లనే కదా మీరు బిల్వవృక్ష రూపం దాల్చాల్సి వచ్చింది అన్నాడట. అలా శివుడికి కూడా శని ఎఫెక్ట్ తప్పలేదట. అందుకే బిల్వ దళాలతో పూజిస్తే శనీశ్వరుడు కరుణిస్తాడని శుభాలను కలిగిస్తాడని భక్తుల నమ్మకం.
Also Read : రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా… అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి