ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ హీరో, హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టూ బాలీవుడ్ స్టార్స్ అందరి బాల్యం గుర్తులు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ అభిమాన తారల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ స్టార్ హీరో చిన్ననాటి పిక్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది. అతని జీవితం హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న ఎందరో కుర్రాళ్లకు స్పూర్తిదాయకం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్వయం కృషితో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకు ఎవ్వరో గుర్తు పట్టండి చూద్దాం.
Advertisement
ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఒకప్పుడు ఉడిపి హోటల్ లో హెల్పర్ గా పని చేశాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అతనికి ఎంతో మంది అభిమానులున్నారు. ఇంతకు ఆ హీరో ఎవ్వరో గుర్తు పట్టండి. ఎవరో కాదండోయ్.. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి. అతను పలు యాక్షన్ చిత్రాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ సంపాదించుకున్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు సునీల్ శెట్టి తన తండ్రితో కలిసి హోటల్ లో పని చేసేవాడట. ఆ సమయం గురించి గుర్తు చేసుకుంటూ తన ఇన్ స్టాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేశారు సునీల్ శెట్టి.
Advertisement
Also Read : శంకరాభరణం హిట్ అయినా… ఆ నటి జీవితం సర్వనాశనం!
చిన్న వయస్సులోనే మా నాన్న గారి రెస్టారెంట్ లో పని చేస్తున్నప్పుడు నేను నీతి, మనుగడ, నైపుణ్యాలను నేర్చుకున్నాను. ముంబైలోని బండ్ కమ్యూనిటికి చెందిన చాలా మందిలాగే మేము కూడా కొన్ని ఉడిపి రెస్టారెంట్స్ నడిపాం. తెలియని విషయమేంటంటే.. మా ఉడిపి రెస్టారెంట్స్ దశాబ్దాలుగా ఉన్నాయి. సరసమైన ధరలకే ఆరోగ్యకరమైన భోజనాన్ని అందించాం. మధ్యాహ్న భోజన సమయంలో రెండు గంటల్లో 300 నుంచి 400 మంది వినియోగదారులకు సేవలందిస్తారు. ప్రతీది తాజాగా ఉండాలి. ఈ పనితో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇప్పటికీ నాకు రెస్టారెంట్స్ అంటే గౌరవం ఉంది. కానీ వాటి వెనుక ఉన్న కష్టం నాకు తెలుసు. మా నాన్న గారు ఎప్పుడు నాకు గురువుగానే ఉంటారు. ఆయన నేర్పిన పాఠాలే నా జీవితాన్ని తీర్చిదిద్దాయి అంటూ సుదీర్ఘమైన నోటు రాశారు సునీల్ శెట్టి. ఇటీవలే ఆయన కుమార్తె అతియా శెట్టి వివాహం టీమిండియా క్రికెటర్ కే.ఎల్. రాహుల్ తో జరిగింది.
Also Read : కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా కథ రియల్ లైఫ్ లో జరిగిందా ..? ఎక్కడంటే…?