Home » చిరంజీవి సినిమాలో అవకాశం కోసం ఇంటికెళ్లి అడిగా.. గోపిచంద్ భార్య గురించి శ్రీకాంత్ ఏమన్నారంటే..?

చిరంజీవి సినిమాలో అవకాశం కోసం ఇంటికెళ్లి అడిగా.. గోపిచంద్ భార్య గురించి శ్రీకాంత్ ఏమన్నారంటే..?

by Anji
Ad

టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 1991లో వచ్చిన “పీపుల్స్ ఎన్ కౌంటర్” సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. వెంటనే మధురానగరిలో హీరోగా అవకాశం రావడంతో ఆ తరువాత కూడా హీరో అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూశాడు. కానీ లాభం లేకపోయింది. అదేసమయంలో ఈవీవీ సత్యనారాయణ విలన్ గా నటించమని కోరడంతో ‘వారసుడు’ చిత్రంలో నటించాడు. ఆ తరువాత దాదాపు 13 సినిమాల్లో విలన్ గా నటించాడు శ్రీకాంత్. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఓ వైపు విలన్, మరోవైపు సెకండ్ హీరో క్యారెక్టర్ చేస్తూ ఆ తరువాత సోలో హీరోగా ఎదిగి తన కెరీర్ లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. 

Advertisement

ఎక్కువ శాతం మల్టీస్టారర్ చేసిన శ్రీకాంత్.. ఫ్యామిలీ ఆడియన్స్ కి తన సినిమాలతో బాగా కనెక్ట్ అయ్యాడు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో మంచి హిట్స్ అందుకున్నాడు.  ఓ సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రను తాను చేయగలనని నిరూపించాడు. ఖడ్గం సినిమాలో పోలీస్ ఆఫీసర్ రాధాకృష్ణగా అందరినీ ఆకట్టుకున్నాడు శ్రీకాంత్. మహిళా అభిమానులను సొంతం చేసుకున్న శ్రీకాంత్ కి ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో ఉన్న అనుబంధం గురించి శ్రీకాంత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చిరంజీవి సినిమాలను చూసి ఆయన అభిమానిగా మారి ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చిన శ్రీకాంత్ ఇండస్ట్రీకి వచ్చారు. ఇక ఆ తరువాత చిరంజీవితో మంచి అనుబంధాన్ని పెంచుకున్నారు. అన్నయ్య అంటూ చిరంజీవిని పిలిచే శ్రీకాంత్ నిజంగానే సొంత తమ్ముడిలా మారిపోయాడట. తాను హీరో అయినప్పటికీ తన అభిమాన నటుడితో కలిసి నటించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. అలాగే శ్రీకాంత్ కి కూడా చిరంజీవితో కలిసి నటించాలనే కోరిక ఉండేది. 

Advertisement

Also Read :   ఐకాన్ స్టార్ గొప్ప మనస్సు.. ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా..

శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా తీయబోతున్నారని తెలిసి చిరంజీవి ఇంటికెళ్లి  ఏటీఎం పాత్ర ఎవ్వరు చేస్తున్నారని శ్రీకాంత్ చిరంజీవిని అడిగాడట. ఇంకా ఎవ్వరినీ అనుకోలేదు అని,  నువ్వు చేస్తావా అని శ్రీకాంత్ తో చిరంజీవి అన్నారట. అందుకోసమే ఇంటికి వచ్చాను.. తాను చేస్తాను అన్నయ్య అని చెప్పాడట శ్రీకాంత్. అలా ఏటీఎం పాత్రలో నటించి ఆయన కోరిక తీర్చుకున్నాడట. ఇక ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రులకు అక్క, నేను, తమ్ముడు ముగ్గురం పిల్లలం.  శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా కొన్ని సినిమాల్లో నటించాడు.  గోపిచంద్ కి శ్రీకాంత్ అక్క నిర్మల కూతురు రేష్మాతోనే 2013లో పెళ్లి జరిగింది. చాలా మందికి గోపిచంద్ భార్య శ్రీకాంత్ మేనకోడలు అనే విషయం తెలియదు అని చెప్పుకొచ్చాడు.  

Also  Read :  నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం.. రామకృష్ణకి తప్పిన ముప్పు..!

Visitors Are Also Reading