Home » Ind Vs Aus : తోక ముడిచిన ఆసీస్… ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం

Ind Vs Aus : తోక ముడిచిన ఆసీస్… ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం

by Bunty
Ad

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది. నాగపూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. రెండున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ లో భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా అదరగొట్టారు. భారత బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. 243 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 91 పరుగులకే కుప్పకూలింది.

Advertisement

 

స్టీవ్ స్మిత్ మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్ల ఘనత అందుకోగా, జడేజా, మహమ్మద్ షమీ రెండేసి వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ కు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో నాలుగు టెస్టుల ఈ సిరీస్ లో టీమిండియా తో ఆదిత్యంలో నిలిచింది. అంతకుముందు 321/7 ఓవర్ నైట్ స్కోర్ తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమ్ ఇండియాలో ఇన్నింగ్స్ ను 139.3 ఓవర్లలో 400 పరుగులకు ముగించింది.

Advertisement

ఓవర్ నైట్ బ్యాటర్ రవీంద్ర జడేజా (70) త్వరగానే అవుట్ అయిన, అక్షర్ పటేల్ (174 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్ తో 84) కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. టేయిలేండర్ మహమ్మద్ షమీ (47 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ లతో 37) విలువైన పరుగులతో భారత్ కు భారీ ఆదిక్యాన్ని అందించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ 7 వికెట్లు తీయగా, ప్యాట్ కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు. నాథన్ లియోన్ ఓ వికెట్ దక్కింది. ఇక రెండు ఇన్నింగ్స్ లో టీమిండియా బౌలర్లు రాణించడంతో, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేసింది.

READ ALSO : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బిగ్ షాక్.. ఆ సినిమా రీమేక్ గా ‘ఓజి’?

Visitors Are Also Reading