ఇండియాలో క్రికెట్ ను చాలా ఇష్టపడి చూస్తారు. క్రికెట్ గురించి అన్ని తెలుసు కాబట్టి చాలామంది ఈ గేమ్ కు అభిమానులు ఉంటారు. అయితే, క్రికెట్ ను ఫాలో అయ్యే చాలామందికి అసలు ప్లేయర్స్ లంచ్ బ్రేక్ లో ఏం తింటారు అన్న అనుమానం ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా కాస్త ఎక్కువ తింటే ఆయాసంతో అసలు ఆడలేరు.తక్కువ తింటే నీరసం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమతూలమైన ఆహారం తీసుకోవడం, మోతాదు మించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. అయితే, టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారో ఇప్పుడు తెలుసుకుందాం.
read also : Amigos Movie : “అమిగోస్” సినిమా ప్లస్ పాయింట్స్ ఇవే…కళ్యాణ్ రామ్ చేసినట్టేనా?
Advertisement
లంచ్ బ్రేక్ లో ఏం తింటారు?
రెండు టీమ్స్ మ్యాచ్ లో తలపడుతున్నప్పుడు, ఆ రోజు, ఆ సమయంలో ప్లేయర్స్ పోషిస్తున్న రోల్ ను బట్టి ఈ లంచ్ ఉంటుంది. ఉదాహరణకు లంచ్ బ్రేక్ సమయంలో ఇద్దరు బ్యాట్స్మెన్ క్రీజ్ లో బ్యాటింగ్ చేస్తూ ఉంటే, వాళ్లు ఈ బ్రేక్ లో చాలా తక్కువగా తింటారు. వికెట్ల మధ్య పరిగెత్తే సమయంలో ఆయాసం ఉండకూడదు కాబట్టి. అదే సమయంలో అలసట రాకూడదు కాబట్టి అరటిపండు, ప్రోటీన్ బార్ వంటివి తక్కువ పరిమాణంలో తీసుకుంటారు. లంచ్ తర్వాత బౌలింగ్ చేయబోయే బౌలర్లు కూడా ఇంతే. వాళ్లు కూడా ఇలా తక్కువ మొత్తంలో అయినా అధిక శక్తిని ఇచ్చే ఆహారాన్ని తింటారు.
Advertisement
ఇక మిగతా వాళ్ళు అంటే బ్యాటింగ్ టీం లో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న వాళ్లు, బౌలింగ్ టీంలో కేవలం ఫీల్డింగ్ చేసే వాళ్ళు ఏదైనా తినడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకు చాలా వెరైటీలు వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్లకు ప్రోటీన్ ఎక్కువగా ఇచ్చే చికెన్, ఫిష్ కచ్చితంగా ఉంటుంది. ఇక శాఖాహారం ప్లేయర్స్ కోసం పప్పులు, కూరగాయలు, సలాడ్ లు అందుబాటులో ఉంటాయి. లంచ్ చివర్లో ఫ్రూట్ సలాడ్ లాంటి డెసర్ట్ కూడా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉండే ఐస్ క్రీమ్ లు కూడా తినొచ్చు. సాధారణంగా ఏ దేశంలో మ్యాచ్ లో జరుగుతున్న కొవ్వు తక్కువగా ఉన్న, శక్తిని ఇచ్చే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ నే లంచ్ లో భాగంగా ప్లేయర్స్ కు అందిస్తారు. క్రికెటర్లకు వాళ్ళ వ్యక్తిగత అలవాట్ల ప్రకారం కూడా ప్రత్యేక లంచ్ ఏర్పాట్లు ఉంటాయి.
READ ALSO : రాజకీయాలకు గుడ్ బై..సినిమాల్లోకి ఏపీ మంత్రి విడదల రజిని?