Home » భ‌ర్త‌కు తెలియ‌కుండా ఆన్లైన్ యాప్ లో పెట్టుబ‌డులు…చివ‌రికి సినిమా రేంజ్ ట్విస్ట్..!

భ‌ర్త‌కు తెలియ‌కుండా ఆన్లైన్ యాప్ లో పెట్టుబ‌డులు…చివ‌రికి సినిమా రేంజ్ ట్విస్ట్..!

by AJAY
Ad

అభివృద్ధి చెందిన టెక్నాల‌జీతో లాభాల‌తో పాటూ న‌ష్టాలు కూడా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే లాభాల కంటే న‌ష్టాలే ఎక్కువ క‌నిపిస్తున్నాయి. అలాంటి న‌ష్టాల‌లో ఆన్లైన్ మోసాలు కూడా ఉన్నాయి. సైబ‌ర్ క్రైం నేర‌గాళ్లు ఈ మ‌ధ్య రెచ్చిపోతున్నారు. ప్ర‌తిఒక్క‌రి చేతిలో ఫోన్ ఉండ‌టంతో ఆన్ లైన్ బ్యాంకింగ్ చేస్తున్న అమాయ‌కుల‌ను కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. తాజాగా ఓ మ‌హిళ కేటుగాళ్ల చేతిలో దారుణంగా మోస‌పోయింది.

Advertisement

 

కేటుగాళ్ల మాయ‌మాట‌లు న‌మ్మి ఆన్ లైన్ యాప్ లో పెట్టుబ‌డులు పెట్టింది. చివ‌రికి ఆ ముఠా చేతిలో దారుణంగా మోస‌పోయింది. ఈ ఘ‌ట‌న బెజ‌వాడ‌లో చోటుచేసుకుంది. బెజ‌వాడ‌కు చెందిన హిమ‌బిందు అనే టెకీ ఆన్ లైన్ యాప్ లో ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెట్టి మోస‌పోయింది. వాషింగ్ ట‌న్ ఫిల్మ్ స్క్వేర్ అనే యాప్ లో హిమ‌బిందు విడత‌లుగా మొత్తం ఏడు ల‌క్ష‌ల రూపాయ‌లు పెట్టింది. భ‌ర్త వ‌ద్దంటే వ‌ద్ద‌ని చెప్పినా విన‌కుండా డ‌బ్బులు పెట్టింది. చివ‌రికి తాను మోస‌పోయిన‌ట్టు గ్ర‌హించింది.

Advertisement

ల‌క్ష‌ల డ‌బ్బు పోగొట్ట‌డంతో భ‌ర్త నాగ‌కృష్ణ‌ప్ర‌సాద్ మంద‌లించాడు. ఇక భ‌ర్త మందలించాడ‌న్న బాధలో ఇంటి నుండి వెళ్లిపోయింది. ఈ ఘ‌ట‌న పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. అంతే కాకుండా ప్ర‌కాశం బ్యారేజీ వ‌ద్ద సీసీ టీవీ పుటేజీలో హిమబిందు క‌ద‌లిక‌ల‌ను పోలీసులు గ‌మ‌నించారు. దాంతో హిమ‌బిందు ఆత్మ‌హ‌* చేసుకుందేమోన‌ని అనుమానిస్తున్నారు. మ‌రోవైపు హిమబిందు కుటుంబ స‌భ్యులు ఆమె ఆచూకి కోసం ఆందోళ‌న చెందుతున్నారు.

ALSO READ:అమిగోస్ సినిమాతో కళ్యాణ్ రామ్ కి మరో బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా ?

Visitors Are Also Reading