కొన్ని చర్యలు, కొన్ని ఆహారాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ రెండింటిని కలిపి చేస్తే అది మన శరీరంపై ప్రభావం చూపుతుంది. ఇటువంటి వ్యతిరేక చర్యలు చాలా ఉన్నాయి. పెద్దలు చాలాసార్లు చెప్పారు. కానీ శాస్త్రం, మడి, మూఢనమ్మకాల పేరుతో విస్మరిస్తున్నాం. పొద్దున్నే పళ్ళు తోముకోకుండా కాఫీ, టీలు తాగకూడదు. బయటికి వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు చేతులు కడుక్కోవాలి. పుల్లని పాలతో తినకూడదు, టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదు ఇలా చాలా మాటలు చెబుతారు మన పెద్దలు. రాత్రి ఆలస్యంగా నిద్రపోకండి. వారి జీవనశైలిలోనే ఆ వారి ఆరోగ్య రహస్యం దాగి ఉంది.
Advertisement
నేటి యువత జీవనశైలి, పని ఒత్తిడి కారణంగా ఒక్కోసారి వారి రోజువారీ షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పనుల్లో తీరిక దొరికినప్పుడు స్నానం చేసి భోజనం చేసి పడుకోవాలి. అలాంటి వారు జీవనశైలిలో చేసే కొన్ని పనులు, ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యానికి హానికరం. ఆరోగ్యానికి హాని కలిగించే పద్ధతుల్లో స్నానం ఒకటి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. శరీరం బాగా అలసిపోయినప్పుడు స్నానం చేస్తే చాలా తేలికగా అనిపిస్తుంది. ఇలా మనం చేసే స్నానానికి ఒక ఆచారం ఉంది. చాలామంది ఉదయం అల్పాహారం తిని స్నానం చేస్తారు. మరి కొందరు రాత్రి భోజనం చేసి స్నానం చేస్తారు. ఇలా ఆహారం తిన్న వెంటనే స్నానం చేయడం సరియైనదా, తప్పా అనేదానిపై అనేక రకాల విచారణలు వచ్చాయి. స్నానం చేయడం వల్ల మీరు రిఫ్రెష్ గా మరియు శక్తిని పొందుతారని కొందరు నివేదిస్తున్నారు. స్నానం మీ శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతోందని చెప్పబడింది. తిన్న వెంటనే కొందరు సిగరెట్ తాగుతారు.
Advertisement
Also Read : ప్రతి రోజూ పరగడుపున ఇవి తీసుకుంటే జీవితంలో ఏ రోగం దరిచేరదు..!
Also Read : బాలకృష్ణ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా ?
కొందరు పండ్లు తింటారు. మరికొందరు వాకింగ్ కు వెళ్తారు. అందువల్ల ప్రతి ఒక్కరికి రకరకాల అలవాట్లు ఉంటాయి. ఆఫీసు పనిమీద ఆకలితో వచ్చి భోజనం చేసి స్నానం చేసేవారు ఉంటారు. భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. రక్తపోటులో ఆకస్మాత్తుగా తగ్గుదల మైకం కలిగిస్తోంది. భోజనం చేసిన వెంటనే స్నానం చేయకపోవడమే మంచిది. భోజనం చేసిన రెండు గంటల తర్వాత స్నానం చేయవచ్చు. లో బీపీ సమస్య ఉన్నవారు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. భోజనం తర్వాత మీరు తినే ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి అవసరం. ఇలాంటి సమయంలో రక్తపోటు తగ్గితే జీర్ణక్రియ కు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. తినడం మరియు స్నానం చేయడం రెండింటికీ నేరుగా సంబంధం లేనప్పటికీ, ఇది మన ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే ఈ సమస్యలన్నీ వస్తాయి. భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరంలో ఉబ్బరం ఏర్పడవచ్చు. నీరసం ఏర్పడవచ్చు. చాతిపై ఒత్తిడి పెరగవచ్చు. గుండెల్లో మంట రావచ్చు. కడుపు తిమ్మిర్లు మరియు జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యంగా ఉండాలనుకునేవారు ఏ కారణం చేతనైన భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. భోజనానికి అరగంట ముందు లేదా తర్వాత స్నానం చేయండి.
Also Read : Ravindra Jadeja: చీటింగ్ చేసిన జడేజా? వీడియో వైరల్!