టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవలే ఈ లోకాన్ని విడిచివెళ్ళిన సంగతి తెలిసిందే. కాగా తన కెరీర్ లో కృష్ణ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి హీరోలు ఇండస్ట్రీ ని ఏలుతున్న సమయంలో కృష్ణ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని వారికి పోటీ ఇచ్చాడు. దాదాపుగా మూడు వందలకు పైగా సినిమాల్లో నటించి ఆయన సత్తా చాటారు.
Advertisement
అప్పట్లో కృష్ణ డేట్స్ దొరకడం కూడా చాలా కష్టం గా ఉండేది. అసలు గ్యాప్ తీసుకోకుండా ఓకే ఏడాది అత్యధిక సినిమాలు చేసిన ఘనత కృష్ణ కే సొంతం. అదే విధంగా కౌబాయ్ లాంటి పాత్రను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా ఆయనే. కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే అల్లూరి మళ్లీ పుట్టాడా అనే రేంజ్ లో తన నటనతో మెప్పించాడు.
Advertisement
అయితే ఒకానొక సమయం లో కృష్ణ కు వరుస ఫ్లాప్ లు పడ్డాయి. ఏకంగా కృష్ణ కు వరుసగా 12 ఫ్లాప్ లు పడ్డాయి. దాంతో కృష్ణ కానీ అయిపోయింది అని చాలా మంది చెవులు కొరుకున్నారు. అంతే కాకుండా కృష్ణ తో సినిమాలు కూడా చేయడానికి ముందుకు రాలేదు.
కానీ అలాంటి సమయం లో కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సొంతంగా బ్యానర్ ను ప్రారంభించాడు. పద్మాలయ ఆర్ట్ పిక్చర్స్ పేరుతో ఆ బ్యానర్ ను ప్రారంభించారు. ఇక ఆ బ్యానర్ లో మొదటి సినిమా పాడిపంటలు తెరకెక్కించారు. ఈ సినిమా తరవాత మళ్లీ కృష్ణ అసలు తిరిగి వెనక్కి చూసుకోలేదు. అంతే కాకుండా దర్శకనిర్మాతలు కూడా కృష్ణ కోసం మళ్లీ క్యూ కట్టారు.
Also read : అత్తారింటికి దారేది సినిమాలో ఈ సీన్ గమనించారా…? మీకూ అదే డౌట్ వచ్చిందా…?