సినిమా ఇండస్ట్రీలో నటనా టాలెంట్ తో పాటుగా కాస్త సెంటిమెంటును కూడా ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ లో కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం నుంచి మొదలు సినిమా షూటింగ్ పూర్తయ్యి థియేటర్లోకి వచ్చేవరకు కొంతమంది హీరోలు,దర్శకులు, నిర్మాతలు సెంటిమెంట్స్ ఫాలో అవుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే ముహూర్తాలు పెట్టుకొని షూటింగ్స్, సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు.
Advertisement
అప్పట్లో నందమూరి తారకరామారావు తెల్లవారుజామున రెండు నుంచి మూడు గంటల మధ్యలో నిద్ర లేవడం అలవాటు. అదే ఆయనకు సెంటిమెంట్ గా ఫాలో అయ్యే వారట.. ఆ సమయానికి నిద్ర లేచి,చుట్ట కాల్చి , ఫ్రెష్ అయ్యి ఇడ్లీ, దోశ వంటివి నెయ్యితో కలుపుకొని తినేవారట. ఆయనకున్న సెంటిమెంటు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం నిద్రలేస్తే మంచి జరుగుతుందని నమ్మేవారట.. అలా ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరో ల సెంటిమెంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రజనీకాంత్:
సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. స్వయంకృషితో పైకి వచ్చిన హీరో. ఆయన సినిమాల్లోకి రావడానికి ముందు బెంగళూరులో బస్ కండక్టర్గా పని చేశారు. ఇప్పటికీ అప్పుడు వేసుకున్న కండక్టర్ యూనిఫామ్ ను జ్ఞాపకంగా దాచుకున్నారు. అప్పుడప్పుడు ఆ యూనిఫామ్ కూడా వేసుకుంటారట..
కింగ్ నాగార్జున :
Advertisement
ఇక తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. నాగార్జునకి దైవభక్తి ఉండదు. కానీ ఓ మనిషికి సాయం చేయడం ఆయన సెంటిమెంట్ గా ఇష్టంగా భావిస్తారట. అలా అని దైవభక్తి లేదని కాదు కానీ దేవుడు కంటే ఎక్కువ మనిషినే నమ్ముతారట.
వెంకటేష్:
ఇక విక్టరీ వెంకటేష్ సినిమాల రిలీజ్ విషయంలో ఓ సెంటిమెంట్ ని తప్పనిసరిగా పాటిస్తారు. తన సినిమాలో ఫస్ట్ కాపీ తాలూకా రీళ్లను నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, మద్రాస్ వడపలలోని కుమారస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో పూజలు జరిపించిన తర్వాతే ప్రదర్శించాలని అంటారట. ఇది వారి తండ్రి దగ్గర నుంచి ఆయన కు వస్తున్న సెంటిమెంట్.
also read: