ఇప్పటి వరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే దర్శకులు కొన్ని కథలను ఇతర భాషల్లో వచ్చిన సినిమాల ఆధారంగా రాసుకుంటారు. అయితే ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు మాత్రమే కాకుండా ఓకే భాషలో వచ్చిన కొన్ని సినిమాల కథలు కూడా ఒకేవిధంగా అనిపిస్తాయి. అంటే సినిమాలో కొత్త దనం ఉన్నా కథ మూలం మాత్రం ఒకేవిధంగా అనిపిస్తుంది.
Advertisement
అలా టాలీవుడ్ లో కూడా సినిమాలు ఉన్నాయి. అందులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మిర్చి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించాడు.
Advertisement
ఈ సినిమా ఫ్యాక్షన్ పగల నేపథ్యం లో వచ్చింది. సత్యరాజ్ తన ఊరి ప్రజలను మార్చడానికి కుటుంబాన్ని సైతం వదిలేస్తాడు. అయితే గోపీచంద్ హీరోగా నటించిన శంఖం సినిమా కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించగా ఆయనకు తండ్రి పాత్రలో సత్యరాజ్ నటించాడు. ఈ సినిమా కూడా పగలు ప్రతీకారాల నేపథ్యం లో తెరకెక్కింది.
ఈ సినిమా కథ కథనాలు కూడా మిర్చి సినిమా ను పోలి ఉంటాయి. అయితే ఈ రెండు సినిమాల్లో ప్రభాస్ నటించిన మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాలోని పాటలు….డైలాగ్ లు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ప్రభాస్ అనుష్క పెయిర్ కు సైతం ప్రశంసలు అందాయి.
Also read : అతనొక్కడే సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?