Home » భోజనం తరువాత అరటిపండును తినవచ్చా..? తింటే ఏమవుతుందంటే..?

భోజనం తరువాత అరటిపండును తినవచ్చా..? తింటే ఏమవుతుందంటే..?

by Anji
Ad

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో జీర్ణ సమస్య ఒకటి. సాధారణంగా కడుపునొప్పి, ఛాతిలో మంట, కడుపులో మంట అనిపించడం వంటి లక్షణాలతో జీర్ణ సమస్యతో బాధపడుతుంటారు. ఇవన్ని కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. వీటిని అధిగమించాలంటే.. సరైన ఆహారం చేసుకోవడం ఫాస్ట్ ఫుడ్ ని దూరం పెట్టడంతో పాటు త్వరగా నిద్రపోవడం శారీరక వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి. జీర్ణ సమస్యల్లో ఎక్కువగా వేధించే రెండు సమస్యలు ఒకటి మలబద్ధకం, రెండు ఎసిడిటి. ఈ జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో అరటిపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. 

Advertisement

ముఖ్యంగా భోజనం చేసిన తరువాత అరటిపండును ముక్కలు ముక్కలుగా కట్ చేసి నలమిరియాల పొడి ఉప్పును చల్లి తినాలి. ఇలా తినడం వల్ల అన్నం త్వరగా జీర్ణమవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు కూడా నయమవుతాయి. అరటిపండ్లలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం సమసయను నివారించడంలో పొటాషియం ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మందికి సోడియం కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది. అరటి పండు ఈ సమస్యను తొందరగా తగ్గిస్తాయి. చిలగడ దుంపలు, పెరుగు, కెఫీర్, కూరగాయలు, పండ్లు, మూలిక టీలు, జీలకర్ర నీరు వంటి ఆహారాలు, పానీయాలు మలబద్ధకాన్ని నివారించేందుకు ఉపయోగపడుతాయి. 

Advertisement

Also Read :  మీ జీర్ణక్రియ సాఫీగా సాగాలంటే ఇలా ప్రయత్నించండి.. ఫలితం పక్కా..!

జీర్ణ సమస్యను పరిష్కరించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడానికి అరటిపండు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అవి మోతాదుకు మించి తినడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశముంది. కాబట్టి రోజు కేవలం రెండు అరటిపండ్లు మాత్రమే తీసుకోవాలి. రాత్రి సమయంలో అరటిపండ్లు అస్సలు తినకూడదు. ఈ జాగ్రత్తలను పాటిస్తే జీర్ణ సమస్యల నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Also Read :  బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లోకి ఎంట్రీ ఇవ్వనున్న రష్మి గౌతమ్..!

Visitors Are Also Reading