పాకిస్థాన్ పేరు వింటేనే అందరూ భయపడిపోతారు. నిత్యం పాక్ లో బాంబుల శబ్దాలే వినిపిస్తాయి. అందుకే ప్రస్తుతం పాక్ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. అయితే, తాజాగా మరోసారి బాంబు పేలుళ్లతో పాకిస్తాన్ దద్దరిల్లిపోతుంది. ఒకపక్క ఆర్థిక మాంద్యం వెంటాడుతుంటే మరోపక్క బాంబు పేలుళ్లు దాయాది దేశాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఐదు రోజుల కిందట పేషావర్ లోని మసీదులో తాలిబన్ సూసైడ్ బాంబర్ జరిపిన దారిలో వందమందికి పైగా చనిపోయిన ఘటనలు మరువక ముందే మరోసారి ఆదివారం బాంబు పేలుడు సంభవించింది. ఈసారి క్వేట్ట నగరంలోని మూసా చౌక్ లో బాంబు పేలింది.
Advertisement
Advertisement
అయితే ఈ ఘటనలో ఇప్పటికీ ఎవరు చనిపోయినట్టు సమాచారం అందలేదు. కేవలం ఐదుగురు మాత్రమే గాయపడినట్టు తెలుస్తోంది. కానీ బాంబు పేలుడు ఎఫెక్ట్ క్వెట్టా వేదికగా జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ పై పడింది. బాబర్ అజామ్స్, సర్పరాజ్ అహ్మద్ చెట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొందరు దుండగులు బాంబు పేలుడు తర్వాత మైదానంలోకి రాళ్లు విసిరారు. అలాగే స్టేడియం బయట నిప్పు కూడా అంటించారు.
దీంతో మధ్యలోనే మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే బాంబు పేలుడు కారణంగా ఆటగాళ్ళకు ఎలాంటి హాని జరగలేదు. ఈ మాచ్ కోసం 13, 000 కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడు అయ్యాయి. మ్యాచ్ కోసం 4,000 మంది పైగా భద్రతా సిబ్బందిని నియమించారు. ఈ మ్యాచ్ చూసేందుకు షాహీద్ ఆఫ్రిది, మోయిన్ ఖాన్, జావేద్ మియందార్ తదితర ప్రముఖులు కూడా క్వెట్ట చేరుకున్నారు.
READ ALSO : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో లొల్లి పెట్టుకున్న బండ్ల గణేష్!