వాణి జయరాం ఆమె గొంతులో ఎంతటి మాధుర్యం ఉందో, ఆమె పాటలు వింటే ఎంతటి టెన్షన్ అయినా ఇట్టే పారిపోతుంది. అలాంటి మధుర సంగీత గాయని వాణీ జయరాం గత ఐదు దశాబ్దాల నుంచి సంగీత ప్రియల్ని అలరిస్తూ వస్తోంది. 78 సంవత్సరాల వాణీ జయరాం ఇలా ఆకస్మాత్తుగా మరణించడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మరి అలాంటి వాణి జయరాం పేరుకు ముందు వాణి అని ఉండటం వెనుక ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
వాణి జయరాం అసలు పేరు ” కలై వాణి” 11 మంది సంతానంలో ఎనిమిదవ సంతానం వాణి. అయితే ఈమె పుట్టినప్పుడు నామకరణ వేడుక చేసే సమయంలో వారి తల్లిదండ్రులకు ఆర్థిక కష్టాలు వచ్చాయట. దీంతో వీరు ఒక సిద్ధాంతి దగ్గరికి వెళ్లి పాపకు ఏదైనా పేరు సూచించామని అడిగితే ఈ పాపకు పూర్వజన్మ పుణ్యఫలం ఉంది. దేవుణ్ణి తేనెతో అభిషేకాలు చేసింది, అందుకే ఈమెకు కలైవాణి అని పేరు పెట్టండని సూచించారట. ఆ టైంలో సిద్ధాంతి చెప్పిన మాటలకు దురైస్వామి హాయిగా నవ్వుకున్నప్పటికీ పాప భవిష్యత్తు గురించి ఇప్పుడే కలలు కనడం ఎందుకని అనుకున్నారట. కానీ కలైవాణి అని పేరు పెట్టేశారు. కానీ సిద్ధాంతి చెప్పిందే నిజమైంది.
Advertisement
ఆమె అద్భుతమైన భక్తి గీతాలు, ఇతర పాటలు పాడడంలో అత్యంత ప్రతిభ కనబరిచి ఎంతో గుర్తింపు సాధించింది. ఇక తల్లి పద్మావతి తెలుగు వారు కాబట్టి తెలుగులోను కూడా మంచి మంచి పాటలు పాడింది అని చెప్పవచ్చు. వాణి జయరాం సంగీత ప్రియుల కుటుంబంలో పుట్టినప్పటికీ వారి కుటుంబీకులకు సినిమా సంగీతం పట్ల అభిప్రాయం ఉండేది కాదట. కానీ వాణి జయరాం ఇంట్లో ఒప్పించి స్వయంకృషితో సినిమా పాటలు పాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. తన సక్సెస్ ను వాని తల్లి చూసింది కానీ , తన తండ్రి చూడలేకపోయాడని వాణి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
also read:షాకింగ్ న్యూస్…చైతూకు విడాకులు ఇచ్చినా అక్కినేని ఫ్యామిలీని విడిచిపెట్టని సమంత..!