టాలీవుడ్ నటుడు నందమూరి వారసుడు తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే మొదటి నుండి తారకరత్న ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉంది. మొదట కుప్పం స్థానిక ఆస్పత్రికి చికిత్స అందించగా, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించారు.
READ ALSO : మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!
Advertisement
అత్యాధునిక పరికరాలతో డాక్టర్లు తారకరత్నకు చికిత్స అందించారు. అంతేకాకుండా తారకరత్నను చూసేందుకు ఆయన కుటుంబీకులు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ లు ఫ్యామిలీతో కలిసి తారకరత్నను పరామర్శించారు. కాగా ఇప్పుడు తారకరత్న చికిత్సకు సంబంధించిన ఖర్చులు, ఆసుపత్రి బిల్లులు ఎవరు భరిస్తున్నారని చర్చ నడుస్తోంది. నందమూరి వారిలో బాలకృష్ణ సహా మిగతా హీరోల్లా తారకరత్నకు పెద్దగా ఆస్తులు లేవని, దీంతో ఆయన చికిత్సకు ఖర్చు ఎవరు భరిస్తున్నారన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.
Advertisement
ఈ క్రమంలో తారకరత్న సతీమణి ఆయన తండ్రి మోహన కృష్ణ చికిత్స విషయంలో తడబడుతుంటే, నందమూరి, నారా కుటుంబ సభ్యులు మేమున్నామన్న ధైర్యాన్ని ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతోంది. తారకరత్న బయట మనిషి కాదు, మా మనిషే అని, తారకరత్న తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేవరకు మొత్తం ఖర్చు అంతా తామే పెట్టుకుంటామని బాలకృష్ణ హామీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణతో పాటు మిగతా కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యులు కలిసి చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రి బిల్లులు కూడా ఇరు కుటుంబ సభ్యులు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Read Also : అప్పుల్లో మునిగిన మంత్రి కేటీఆర్… ఏకంగా రూ. 27 కోట్ల అప్పు!