టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొద్ది నెలలుగా వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత ఐదారు నెలలలో ఇండస్ట్రీకి చెందిన ఐదుగురు దిగ్గజ నటి, నటులను సినీ పరిశ్రమ కోల్పోయింది. ఈ మధ్య కాలంలోనే సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు వంటి నటులు మరణించిన విషయం తెలిసిందే. గత వారమే అలనాటి నటి జమున మరణించారు. ఆమె మరణ వార్త నుంచి బయటపడక ముందే.. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె విశ్వనాథ్ గారు తిరిగిరాని లోకాలకు వెళ్లారు.
Advertisement
కె విశ్వనాథ్ ఫిబ్రవరి 2, 2023 గురువారం రోజు తుది శ్వాస వదిలారు. ఈయన మరణించే క్షణాల ముందు వరకు కూడా కళామతల్లికి సేవలు చేస్తూనే కన్నుమూశారు. అయితే గురువారం రాత్రి కూడా ఈయన పాటలు రాస్తూనే ఉన్నారు. పాటలు రాస్తున్న సమయంలో ఈయనకు అకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తడంతో ఆ పాటను పూర్తి చేయమని తన కొడుకుకి చెప్పారు. కుమారుడు పాట పూర్తి చేస్తుండగానే.. ఈయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కే విశ్వనాథ్ గారు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు.
Advertisement
ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మార్గం మధ్యలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాదాపు 5 దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన విశ్వనాధ్ చివరి క్షణాల వరకు కూడా కళామతల్లికి సేవలు చేస్తూనే తుది శ్వాస విడిచారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విశ్వనాథ్ మరణ వార్త తెలియగానే సినీ ప్రముఖులందరూ తరలివచ్చి ఈయనకు నివాళులర్పించారు. హైదరాబాద్ నగరంలో పంజాగుట్ట స్మశాన వాటికలో కె విశ్వనాథ్ అంత్యక్రియలను బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం శుక్రవారం నిర్వహించారు.
Also Read : కళాతపస్వి విశ్వనాథ్ ఎస్ సెంటిమెంట్ గురించి మీకు తెలుసా ?