సాధారణంగా మనం రకరకాల పండ్లను తింటుంటాం. అందులో కొన్ని పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. కొన్ని పండ్లు పోషకాలతో నిండి ఉండడంతో.. వాటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితముంటుంది. అందుకే వైద్య నిపుణులు పండ్లు తినాలని సూచిస్తుంటారు. ఇక వ్యాధుల విషయంలో పండ్ల వినియోగ విషయానికొస్తే.. పండ్లను ఎంచుకోవడం చాలా కష్టంగా మారుతుంటుంది. అలాంటి పరిస్థితిలో నలుపు పండ్లు తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే నల్లని పండ్లను తినాలి. నల్లని పండ్లలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పోషకాలు, కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను తగ్గిస్తాయి. అయితే ఈ నల్లని పండ్లలో ఏది తీసుకుంటే మంచిదనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
బ్లాక్ బెర్రీస్ :
బ్లాక్ బెర్రీస్ లలో పోషకాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఫైబర్, విటమిన్ సి, మాంగనీస్ వంటి పోషకాలుంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా ఉండేవిధంగా ఉపయోగపడుతాయి. అదేవిధంగా బ్లాక్ బెర్రీస్ కొలెస్ట్రాల్ అందుపులో ఉంటుంది. అదేవిధంగా డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
నల్ల అత్తి పండ్లు :
బ్లాక్ అంజీర్ పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే ప్రోబయోటిక్ గుణాలు జీర్ణక్రియకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అత్తి పండ్లలో పైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువుని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
Advertisement
నల్ల కిస్మిస్ :
నల్ల కిస్మిస్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ అధికంగా ఉంటుంది. నల్ల కిస్మిస్ లు రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతాయి. వీటిని తినడం వల్ల ఎముకలు చాలా దృఢంగా మారుతాయి. నల్ల కిస్మిస్ లు రక్తహీనతను తగ్గిస్తాయి.
Also Read : ఖర్బూజ పండును వారు తప్పక తినాల్సిందే..!
బ్లాక్ చెర్రీ :
చాలా మందికి ఎరుపు రంగులో ఉండే చెర్రీ పండ్ల గురించి మాత్రమే తెలుసు. కానీ బ్లాక్ చెర్రీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ బ్లాక్ చెర్రీలో యాంటీ ఇన్ ప్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియల నొప్పులాంటి సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతాయి.
నల్ల ద్రాక్ష :
నల్ల ద్రాక్ష పండ్లు రుచికి చాలా పుల్లగా ఉంటాయి. కానీ అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మం జుట్టుకు కూడా ఉపయోగపడుతుంది.
Also Read : పాలలో ఆ రెండింటిని కలుపుకొని తాగితే ఆ సమస్యలకు చెక్..!