80వ దశకంలో దక్షిణాది చిత్ర సినిమాలో సిల్క్ స్మిత అంటే ఒక బ్రాండ్. అప్పట్లో స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారట. అలాంటి సిల్క్ స్మిత ఇండస్ట్రీలో ఎంత త్వరగా స్టార్ నటిగా ఎదిగిందో అంతే త్వరగా ఇండస్ట్రీనే కాకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. 36 వీళ్ళకే ఆ**త్య చేసుకొని మరణించింది. ఆమె మరణం ఇప్పటికీ ఒక మిస్టర్ అని చెప్పవచ్చు.. అయితే ప్రేమ విఫలమై మరణించిందని కొందరు అంటే, నిర్మాణరంగంలో పెద్ద ఎత్తున నష్టాల పాలై చనిపోయిందని మరికొందరు, మద్యపానానికి బానిసై ఇంకొందరు అంటూ ఉంటారు.
Advertisement
ఆమె చనిపోవడానికి ముందు రోజు రాత్రి చాలామందికి ఫోన్ చేసి మాట్లాడినట్టు ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలలో చాలామంది చెబుతున్నారు. అయితే కన్నడ నటుడు రవిచంద్రన్ మొదలు తెలుగు నటి అనురాధ దాకా చాలామంది తమ అభిమానాన్ని తలుచుకొని బాధపడ్డారు.
Advertisement
అప్పట్లో సిల్క్ స్మిత మరణ వార్త విన్న సినీ దిగ్భ్రాంతికి లోనయింది. ఆమె ని ఆఖరి చూపు చూసేందుకు ఎక్కువమంది రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్టార్ గా ఉన్నప్పుడు ఆమెను వాడుకుని ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదిగారు. అలాంటి వారు కూడా ఆమెను ఆఖరి చూపు చూడడానికి రాలేదట.
కానీ ఎవరూ రాకపోయినా సిల్క్ స్మితను చివరిసారి చూసేందుకు స్టార్ హీరో అర్జున్ మాత్రమే వచ్చారు. ఎవరూ రాకపోయినా అర్జున్ మాత్రం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో కొంతమంది జర్నలిస్టులు ఆయన్ను డైరెక్ట్ గా అడిగారు. దీనికి సమాధానంగా అర్జున్ మాట్లాడుతూ.. ఓ సినిమా షూటింగ్లో నేను సిల్క్ స్మిత తో మాట్లాడినప్పుడు ” నేను చచ్చిపోతే చూడ్డానికి వస్తావా అని అడిగిందట.. అదేం మాట అని తేలిగ్గా కొట్టి పారేసాడట అర్జున్.. ఆమె మాటలను సీరియస్గా తీసుకోలేదట. కానీ సిల్క్ స్మిత చనిపోయిన తర్వాత అర్జున్ ఆ మాటలు గుర్తు చేసుకుంటూ చిన్నపిల్లాడిలా బోరున విలపిస్తూ కన్నీరు పెట్టుకున్నారని సమాచారం.
also read:నయనతార ఆస్తుల లెక్క తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే…మొత్తం ఆస్తి విలువ ఎంతంటే…?