టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండస్ట్రీ లో నయనతార స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నయన్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా స్టార్ హీరోలకు జోడీగా నటించి కోట్ల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇక నయన్ ఇండస్ట్రీలో ఎంట్రీ చాలా కాలం అవుతున్న సంగతి తెలిసిందే. కొంతమంది అందం అభినయం ఉన్నా ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో కొనసాగలేరు.
Advertisement
కానీ నయన్ కొన్నేళ్ళ నుండి ఇండస్ట్రీ లో బిజీగా ఉంటోంది. ఇక నయన్ కు ఉన్న క్రేజ్ తో రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుంటోంది. అంతే కాకుండా సినిమాల ప్రొడక్షన్ తో పాటూ నయన్ ఇతర వ్యాపారాలు కూడా చేస్తోంది. ఇండస్ట్రీ లో ఫుల్ బిజీగా ఉన్న నయనతార ఆస్తులు కూడా భారీగా కూడబెట్టింది. నయన్ కు హైదరాబాద్ తో పాటు చెన్నై, ముంబయి లో లగ్జరీ అపార్ట్ మెంట్ లు ఉన్నాయి.
Advertisement
Nayanatara Vignesh shivan
వాటి విలువ దాదాపు రూ.100 కోట్ల వరకూ ఉంటుంది. అంతే కాకుండా నయనతార కు సొంతంగా ప్రైవేట్ జెట్ కూడా ఉంది. దాని విలువ రూ.50 కోట్ల వరకూ ఉంటుంది. ఇక నయనతార ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి సినిమాలను నిర్మిస్తుంది.
తన భర్త తో కలిసి నయన్ రౌడీ పిక్చర్స్ పేరుతో బ్యానర్ ను షురూ చేసి సినిమాలను నిర్మిస్తుంది. మరోవైపు కాస్మొటిక్ రంగంలో కూడా నయనతార రాణిస్తుంది. ది లిప్ బామ్ పేరుతో నయనతార కాస్మొటిక్ బ్రాండ్ ను ప్రారంభించి వ్యాపారం చేస్తోంది. వీటి తో పాటు నయన్ వద్ద కోట్లు విలువ చేసే బీఏండబ్ల్యు, బెంజ్ లాంటి 5 ఖరీదైన కార్ లు ఉన్నాయి.
Advertisement
Also read :అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి