సినిమా ఇండస్ట్రీలో స్టార్లుగా ఎదిగిన వారి దగ్గర నుంచి, చిన్న తారల వరకు ఏదో ఒక రకంగా వేధింపులు ఎదుర్కొన్న వారే. అయితే కొంతమంది బయట పడుతుంటారు. మరి కొంత మంది మాత్రం లోలోపల కుమిలిపోతుంటారు. అయితే తాజాగా అన్నది ఫ్లోరా విషయంలో ఇదే జరిగింది. నటి ఫ్లోరా సైనీ, ఆశా సైనీగా తెలుగు ప్రజలకు బాగా సుపరిచితం అయిన పేరు. చిన్న వయసులోనే తెరంగేట్రం చేసి తన ప్రతిభతో అందరికీ చేరువైంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆశా, తిరిగి సినిమాల్లోకి వస్తున్నట్లు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.
Advertisement
Advertisement
అయితే, తనకు 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఓ నిర్మాతతో ప్రేమలో పడ్డానని, అతను చిత్రహింసలకు గురి చేశాడని పేర్కొంది. తన అనుభవాలతో ఓ వీడియో విడుదల చేసి సంచలన వాక్యాలు చేసింది. ‘తక్కువ కాలంలోనే పదికి పైగా సినిమాలు చేశా. డిజైనర్ల బ్రాండ్స్ కోసం మోడల్ గా పనిచేశా. ఆ టైంలోనే నిర్మాతతో ప్రేమలో పడ్డా. కొన్ని రోజులకే పరిస్థితులు మారిపోయాయి. అతను నన్ను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు.
ముఖం, ఇతర ప్రైవేట్ కొట్టేవాడు. మొబైల్ ఫోన్ లాక్కుని ఎవరితో మాట్లాడనీయలేదు. నటించడం మానేయమన్నారు. 14 నెలలపాటు నిర్బంధించాడు. ఒకరోజు సాయంత్రం కడుపులో తన్నాడు. దాంతో ఆ బాధలన్నీ భరించలేక అక్కడి నుంచి పారిపోయి అమ్మ నాన్నలతో కలిసి ఉన్నా. అతని నుంచి బయటపడడానికి చాలా నెలల టైం పట్టింది. తర్వాత అన్ని చక్కబడ్డాయి. కొత్త బంధంలోకి అడుగు పెడుతున్నా. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలని’ వీడియోలో తెలిపింది.
READ ALSO : జక్కన్న, అల్లు అరవింద్ కు మధ్య గొడవలు….అందుకే బన్నీని రాజమౌళి పక్కన పెట్టారా?