టి20 చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం దక్కింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో టీం ఇండియా 168 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. అంతకుముందు 2018 లో ఐర్లాండ్ పై 143 పరుగుల తేడాతో గెలిచింది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 70 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఇక నిన్నటి మ్యాచ్ లో సెంచరీ బాదిన గిల్, టి20 లో భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Advertisement
టీమిండియా ఓపెనర్ గిల్ చిన్న వయసులోనే రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఈరోజు NZపై సెంచరీ చేసిన 23 ఏళ్ల ఈ సంచలనం, అన్ని ఫార్మాట్లలో సెంచరీ బాదేశారు. అతి తక్కువ వయసులో ఈ ఫీట్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అలాగే టి20 సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ ఇతడే. అంతేకాదు టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్. అన్ని ఫార్మాట్లో నిలకడగా రాణిస్తూ భవిష్యత్తు ఆశా కిరణంగా మారాడు.
Advertisement
టీమిండియా యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్ T20, ODI అన్న తేడా లేకుండా ప్రతి మ్యాచ్ లో సెంచరీ ఇన్నింగ్స్ ఆడుతూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన టి20లో గిల్ 126 పరుగులు చేసి భారత్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. దీంతో గిల్ ను కింగ్ కోహ్లీ అభినందిస్తూ ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. భవిష్యత్తు ఇక్కడే ఉంది అని ప్రశంసించారు.
READ ALSO : Director Sagar Passed Away : టాలీవుడ్‌కు వరుస విషాదాలు.. సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత..