బాహుబలి తరువాత రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ డమ్ ఏ రేంజ్ కి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్కెట్ పరిధులను కూడా విస్తరించి ఆ తరువాత వచ్చిన అనేక సినిమాలకు దారి చూపించింది. ప్రభాస్ విషయానికొస్తే.. బాహుబలి తరువాత చేసిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలతో ఇండియా వైడ్ గా తిరుగులేని మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇదే క్రమంలో ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే సినిమాలు సహా మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇవేకాకుండా.. పఠాన్ సినిమా దర్శకుడితో ప్రభాస్ జతకట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం తాను తీసుకునే రెమ్యూనరేషన్ వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి.
Advertisement
ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్, సినిమాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. వీటి తరువాత అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. ఇటీవలే షారూఖ్ ఖాన్ తో పఠాన్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. ప్రభాస్ తో భారీ చిత్రం రూపొందించేందుకు చర్చలు జరుపుతున్నాడు. ఈ మధ్య తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకి రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ సిద్ధార్థ్ సినిమాతో పాటు భవిష్యత్ లో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యూనరేషన్ పెంచాడని టాక్ వినిపిస్తోంది.
Advertisement
Also Read : తారకరత్న హెల్త్ పై చిరంజీవి పోస్ట్.. ‘ఎలాంటి ప్రమాదం లేదనే మాటతో ఉపశమనం’
ఇకపై ప్రభాస్ తన ఒక్క సినిమాకి రూ.150 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకోనున్నాడని సమాచారం. వాస్తవానికి ప్రభాస్ కి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉన్నందున తను కోట్ చేసిన మొత్తం చెల్లించడానికి మేకర్స్ సైతం సిద్ధంగా ఉన్నట్టు వినికిడి. సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ చేయబోయే సినిమాని టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ సంబంధిత వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. ఇందులో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడనే వార్త వినిపిస్తోంది. ఈ చిత్రం 2025లో విడుదల కానున్నట్టు సమాచారం. ప్రభాస్ ఒక్కడి రెమ్యూనరేషన్ రూ.150 కోట్లు అయితే.. ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయం ప్రేక్షకులకు అంతుచిక్కనట్టుగా కనిపిస్తుంది. మరోవైపు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ సైతం రూ.150 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని.. ఈ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : ఈ అందమైన జలపాతం వెనుక దాగి ఉన్న హిస్టరీ గురించి మీకు తెలుసా ?