Home » China: అక్కడ పెళ్లి కాకున్నా పిల్లల్ని కనొచ్చు..చట్ట ప్రకారమే..!

China: అక్కడ పెళ్లి కాకున్నా పిల్లల్ని కనొచ్చు..చట్ట ప్రకారమే..!

by Sravanthi
Ad

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఉండేది. ఈ తరుణంలో అక్కడి ప్రభుత్వాలు జనాభా కట్టడి కోసం అనేక రూల్స్ తీసుకొచ్చింది. ఒక్కరికంటే ఎక్కువ పిల్లల్ని కంటే శిక్షలను కూడా అమలు చేసింది. అలాంటి చైనాలో ఇప్పుడు రూల్స్ బ్రేక్ అయ్యాయి.. అక్కడ ఎంతమంది పిల్లలనైనా కనచ్చు. ఇక మరో విషయం ఏంటంటే..పెళ్లి కాకుండా కూడా పిల్లల్ని కనొచ్చు.. దాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ వస్తోంది.. మరి ఎందుకు అలాంటి రూల్స్ తెచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

చైనాలోని చాలా ప్రావిన్సుల్లో ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుందట. యంగ్ జనరేషన్ తగ్గడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ముఖ్యంగా సిచువాను ప్రావిన్స్ పాలకులకు ఏం చేయాలో అర్థం కాక చివరికి సరికొత్త స్కీం తీసుకొచ్చారు. పెళ్లితో పనిలేదు పిల్లల్ని కనండి అంటూ చెబుతున్నారు. ఇలాంటి వారికి చట్టబద్ధమైన అన్ని వెసులుబాట్లు కూడా లభిస్తాయి అని చెబుతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయట. ఈ రూల్స్ వల్ల ఇకపై సిచువాను ప్రావిన్స్ లో పెళ్ళికాని వారు పిల్లల్ని కనాలనుకుంటే సంబంధిత అధికారుల దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు. వీళ్లు ఎంతమంది పిల్లలనైనా కనవచ్చు.

Advertisement

దీనికి ప్రధాన కారణం చైనాలో పరిస్థితి దారుణంగా ఉంది. 1990 నుంచి వేగవంతమైన అభివృద్ధిని సాధించిన చైనా ఆర్థిక వ్యవస్థ పై దెబ్బ పడింది. సరిపడా జనాభా లేకపోవడమే, ఇందులో ముఖ్యంగా యంగ్ జనాభా లేని కారణంగా దేశంలోని అన్ని రంగాల్లో ఉత్పత్తి పడిపోయేలా ఉంది. ఇదే కనుక జరిగితే మరి కొన్ని సంవత్సరాలలో చైనా ఆర్థికమాంద్యంలో కూరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రూల్స్ తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.

also read:

Visitors Are Also Reading