Home » Jan 29th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Jan 29th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారని అన్నారు. తన ఫోన్ 3 నెలల నుంచి ట్యాప్ చేస్తున్నారని… ఈ విషయం ముందే తెలుసన్నారు. రహస్యాలు మాట్లాడుకునేందుకు వేరే ఫోన్, 12 సిమ్‌లు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Advertisement

బెంగళూరులోని హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. కాసేపట్లో జూ.ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ లు బెంగుళూరు వెళ్లనున్నారు.

గుంటూరు ఉండవల్లిలో పెను ప్రమాదం తప్పింది. సాంబశివ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ కేబుల్ తెగిపడింది. మూడో ఫ్లోర్ నుంచి ఒక్కసారి లిఫ్ట్ కిందపడటం తో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇరాన్‌పై ఇజ్రాయిల్ వరుస దాడులు చేస్తోంది. అర్థరాత్రి బాంబులతో ఇజ్రాయిల్ విరుచుకుపడింది. ఇరాన్‌లో నాలుగు చోట్ల బాంబు దాడులు చేసింది.

Advertisement

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు దగ్గర కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్లి కారు డివైడర్ ను ఢీకొట్టింది. యువతులు మద్యం మత్తులో కారు నడిపారు.

నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.


యువగళం యాత్రలో భాగంగా నారా లోకేష్ ఏపి సర్కార్ పై విమర్శలు కురిపించారు. ఏపీలో మహిళల భద్రత కు బరోసా లేదని అన్నారు. దిశ చట్టం పేరుతో మహిళలను మోసం చేశారని లోకేష్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ లో అధికారం లోకి రావడమే లక్ష్యం గా మోడీ సర్కార్ పని చేస్తోంది. ఫిబ్రవరి 10 నుండి 25 వ తేదీ వరకు రాష్ట్రంలో మోడీ 5 సభలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ రేపు శ్రీనగర్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.

Visitors Are Also Reading