చిత్ర పరిశ్రమలో స్టార్లు అందరూ వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు. ఒకరి తర్వాత, ఒకరు పెళ్లికి సిద్ధమవుతున్నారు. నిన్న శర్వానంద్ ఎంగేజ్మెంట్ చేసుకోగా, తాజాగా మరో జంట పెళ్లి పీటలు ఎక్కింది. కన్నడలో పలు సినిమాలు చేసి గుర్తింపు సంపాదించుకున్న నటి హరిప్రియ, పిల్ల జమిందార్, జై సింహ, వంటి తెలుగు చిత్రాల్లోనూ నటించింది. ఈ అందాల భామ కన్నడ నటుడు వశిష్ట సింహను తాజాగా పెళ్లి చేసుకుంది. ఈ జంట వివాహం మైసూర్ లో జనవరి 25న కనుల పండుగగా జరిగింది.
Advertisement
ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అభిమానులు అందరూ షేర్ చేయడం మొదలుపెట్టారు.కన్నడ నటుడు ధనుంజయ ఈ పెళ్లికి హాజరయ్యాడు. నూతన వధూవరులతో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ పిక్స్ లో హరిప్రియ, వశిష్ట సింహ సాంప్రదాయ దుస్తులు ధరించే కనిపించారు.
Advertisement
వివాహానికి సంబంధించిన ఫోటోలను ఈ జంట ఇంతవరకు షేర్ చేయలేదు. కాగా, హరిప్రియ, కేజిఎఫ్ నటుడు వశిష్ట సింహా నిశతాబ్దం డిసెంబర్ 2న జరిగింది. “మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం. మా నిశ్చితార్థం వేడుకగా జరిగింది. మీ ఆశీస్సులు కావాలి” అని పోస్ట్ పెట్టారు. బెంగళూరులోని హరిప్రియ నివాసంలో ఈ నిశ్చితార్థం వేడుక జరగగా, ఈ కార్యక్రమానికి వశిష్ట, హరిప్రియ కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
READ ALSO : అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !