తెలుగు సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ జానకి అంటే తెలియని వారు ఉండరు. అమ్మ పాత్రలకు పెట్టింది పేరు. నటిగా చేయడమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్పడం వల్ల చాలా పాపులర్ అయ్యారు. అందుకే డబ్బింగ్ జానకి గా పేరు పొందింది. డబ్బింగ్ జానకి నటిస్తున్న సమయంలో షావుకారు జానకి, సింగర్ జానకి అనే ఇద్దరు ప్రముఖులు ఉండటం వల్ల ఈమె డబ్బింగ్ జానకి గానే ఫిక్స్ అయిపోయింది. అలాంటి డబ్బింగ్ జానకి కాళ్ళను స్టార్ నటుడు కమలహాసన్ పట్టుకున్నారు.. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం..?
Advertisement
also read:ICC ODI Rankings : కివిస్ పై క్లీన్ స్వీప్…3 ఫార్మాట్లలోనూ టీమిండియాదే అగ్రస్థానం !
Advertisement
డబ్బింగ్ జానకి ఎక్కువగా కే. విశ్వనాథ్ డైరెక్షన్లో 17 సినిమాలు చేసింది . ఆయన సినిమాల ద్వారానే ఆమెకు పేరు వచ్చింది. ఇక శంకరాభరణం మూవీలో జానకి పాత్ర చాలా బాగుంటుంది. ఇక సాగర సంగమం సినిమాలో కమలహాసన్ తల్లిగా అద్భుతంగా నటించింది అని చెప్పవచ్చు. రోగిష్టి తల్లి కోసం కమలహాసన్ డాన్సర్ కావాలని, ఆ టైంలోనే ఆమె కన్నుమూయడం వంటి సీన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో చనిపోయిన తల్లి కాళ్లు పట్టుకొని ఏడుస్తూ ఉండే సీను ఉంటుంది. అయితే ఏ సీన్లో అయినా హీరో చిన్న నటుల కాళ్ళను పట్టుకోడానికి ఒప్పుకోరు. కాని కమలహాసన్ మాత్రం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ చిత్రంలో డబ్బింగ్ జానకి కాళ్లు పట్టుకొని ఏడ్చే సీన్ లో అద్భుతంగా నటించారు. అలా పెద్ద నటుడు నా కాళ్లు పట్టుకునే సరికి నేను తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యానని డబ్బింగ్ జానకి ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.
also read: