ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య మానసిక సమస్య.. ఈ సమస్య అనేది కొంతమందికి కుటుంబాల వల్ల రావచ్చు, మరికొంతమందికి ఆఫీస్ వర్క్ వల్ల రావచ్చు, మరి ఏదైనా కావచ్చు అధిక ఒత్తిడికి గురైతే మానసిక సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఏర్పడినప్పుడు మనిషిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. మరి అలాంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా మనిషి మనసికంగా అలసిపోయారని ఈ సాంకేతాలు తెలియజేస్తాయి.
Advertisement
also read:ICC ODI Rankings : కివిస్ పై క్లీన్ స్వీప్…3 ఫార్మాట్లలోనూ టీమిండియాదే అగ్రస్థానం !
కాబట్టి మనిషి ధ్యానం చేయడం, కాస్త విరామం తీసుకోవడం ద్వారా మానసిక అలసటను అధిగమించవచ్చు. ఒక వ్యక్తి కొన్ని సమయాల్లో ఆందోళన చెందుతూ లేదా డిప్రెషన్ గురవుతూ ఉంటాడు. ఇది మానసిక అలసట లక్షణాల్లో ఒకటి. అలాంటి సమయంలో విరామం తీసుకోండి. మీ దృష్టి మరో దానిపై కేంద్రీకరించండి. దీనివల్ల మీరు ఆందోళన నుండి రక్షించుకోవచ్చు. ముఖ్యంగా వ్యక్తి ఒంటరిని అనుకున్నప్పుడు గుంపు మధ్య కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తాడు.
Advertisement
అది కూడా మానసిక అలసట లక్షణాల్లో ఒకటి. ఇలాంటి సమయంలో స్నేహితులతో కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపండి. మీ సమస్యల్ని వారితో పంచుకోండి. ముఖ్యంగా మీకు పనిపై ఏకాగ్రత లోపించి చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోతే అది మానసిక అలసట లక్షణాల్లో ఒకటి. ఇలాంటి సమయంలో బాధిత వ్యక్తులు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. అలాగే కోపం, చిరాకు కూడా ఈ అలసట లక్షణాల్లో ఒకటి. దీనికి కూడా విశ్రాంతి తీసుకోవడమే పరిష్కారమని నిపుణులు అంటున్నారు.
also read: