అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా డిసెంబర్ 2 విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది.
టాక్ ఎలా ఉన్నప్పటికీ థియేటర్లలో మాత్రం సందడి వాతావరణం కనిపిస్తోంది. కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నాయి. ఇదిలా ఉంటే పుష్పకు ఇప్పుడు లేని పోని తిప్పలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే ఓ జర్నలిస్ట్ పుష్ప కథ నాదే అంటూ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: పుష్పలో అల్లు అర్జున్ పక్కన చేసిన ఈ కేశవ ఎవరో తెలుసా?
అయితే ఇప్పుడు పుష్ఫ కథ ఓ వెబ్ సిరీస్ ది అంటూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. నార్కోస్ అనే వెబ్ సిరీస్ నుండే సుకుమార్ కథను ఎత్తుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యింది. డ్రగ్స్ ను సరఫరా చేసే ఎస్కో బార్ అనే వ్యక్తి జీవిత కథే నార్కోస్. సాధారణ డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తిగా కెరీర్ ను ప్రారంభించిన ఎస్కోబార్ డాన్ గా ఎలా ఎదుగుతాడు అన్నదే సినిమా కథ.
అయితే ఈ సిరీస్ ను ఆధారంగా చేసుకునే సుకుమార్ డ్రగ్స్ స్థానంలో ఎర్రచందనం స్మగ్లింగ్ పెట్టి సినిమా తీశాడనేది నెటిజన్ల వాదన… అంతే కాకుండా పుష్ప సినిమాలో ఉన్న కొండారెడ్డి బ్రదర్స్ పాత్రల మాధిరిగానే నార్కోస్ లోనూ పాత్రలు ఉన్నాయట. ఆ పాత్రల ఆధారంగానే సుకుమార్ కొండారెడ్డి బ్రదర్స్ ను తీసుకున్నారని సుకుమార్ పై మండిపడుతున్నారు. స్టైలిష్ స్టార్ హీరోగా పాన్ ఇండియా సినిమా అంటూ కాపీ కథను తెరకెక్కిస్తారా అంటూ సుకుమార్ పై ఫైర్ అవుతున్నారు. అయితే ఇందులో ఎంత వరకూ నిజం ఉందో తెలియాలంటే మాత్రం సుకుమార్ స్పందించాల్సిందే.
Also Read: పుష్ప సాంగ్.. మేల్ వెర్షన్ ఎలా ఉందంటే..?